
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- ఫిఫా ప్రపంచకప్ కు అర్హత సాధించాలి అని ఎన్నో దేశాలు సర్వశక్తుల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫిఫా ఫుట్బాల్ మ్యాచ్ లు అనేవి మనదేశంలో అంతగా ప్రాముఖ్యత లేకపోయినా ప్రపంచ దేశాల్లో ఫుట్బాల్ క్రీడ చాలా పవర్ఫుల్. అయితే ఈ ఫిఫా ప్రపంచ కప్పుకు అతి చిన్న దేశం అర్హత సాధించడమే కాకుండా సరికొత్త రికార్డు సృష్టించింది. కరేబియన్ దీవి దేశమైనటువంటి కురాకో అనే దేశం అతి చిన్న దేశమైనప్పటికీ ఫిఫా ప్రపంచ కప్ కు అర్హత సాధించి రికార్డు సృష్టించింది. కేవలం 1.56 లక్షల జనాభా మాత్రమే ఈ దేశంలో ఉన్నారు. అతి చిన్న జనాభా గల దేశం ఫిఫా ప్రపంచ కప్ కు అర్హత సాధించడం అనేది మామూలు విషయం కాదు. గతంలో ఐస్లాండ్ పేరిట ఉన్న రికార్డును ఈ కురాకో అనే దేశం బద్దలు కొట్టింది. తాజాగా జమైకాతో జరిగిన కీలక క్వాలిఫైయింగ్ మ్యాచు లో 0-0 తో డ్రా చేసుకొని 2026 ఫిఫా వరల్డ్ కప్పులో స్థానం సంపాదించింది. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ప్రపంచకప్ కు అర్హత సాధించడంతో ఆ దేశంలోని ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Read also : ఇందిరమ్మ చీరలు పంపిణీ.. మొదట గ్రామాల్లో మాత్రమే?
Read also : IBOMMA రవికి కోర్టు ఏ శిక్ష విధిస్తుందో తెలుసా?





