
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- శ్రీశైలం డ్యాం వద్ద మళ్లీ సైరన్ మోగింది. శ్రీశైలం జలాశయం మళ్లీ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి దిగువకు వరద భారీగా వస్తుండడంతో శ్రీశైలం డ్యాం మళ్ళీ పూర్తిగా నిండి నిండుకుండలా మారింది. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.80 అడుగులకు చేరింది. దీంతో శ్రీశైలం గేటు వద్ద భారీ సైరన్ మోగించిన అధికారులు… ఏ క్షణమైనా గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. కాబట్టి శ్రీశైలం గేటు వద్ద భారీ సైరన్ ముగించి చుట్టుపక్కల ప్రజలను అప్రమత్తం చేశారు. శ్రీశైలం గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని డ్యామ్ అధికారులు వెల్లడించారు. కాగా భారీ సైరన్ మోగించి దగ్గర్లో ఉన్నటువంటి మత్స్యకారులకు ముందస్తు హెచ్చరికలను జారీ చేశారు.
ఇక ఇప్పుడు కానీ డ్యామ్ గేట్లు ఎత్తినట్లయితే వరుసగా ఈ ఏడాది కాలంలోనే… అది కూడా ఒక వారంలోపే రెండోసారి డ్యాం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసినట్లు అవుతుంది. కాగా ఈ మధ్యనే ఈనెల 8వ తేదీన డాం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తిన అధికారులు వారం రోజుల తర్వాత అనగా 15వ తేదీన మూసి వేయడం జరిగింది. దీంతో గేట్లు ఎత్తిన సమయంలో శ్రీశైలం ఘాట్ రోడ్డు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దాదాపు గేట్లెత్తిన వారం రోజులు పాటు భారీగా ట్రాఫిక్ జామ్ తలెత్తడంతో చాలామంది డ్యామ్ చూడ్డానికి వచ్చిన వారు వెనుదిరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మళ్లీ వారంలోపే రెండోసారి గేట్లు ఎత్తే అవకాశం ఉండడంతో మళ్లీ నల్లమల ఘాట్ రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఫారెస్ట్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
పవన్ కళ్యాణ్ సినిమా సూపర్ హిట్ కావాలని అలిపిరి మెట్ల వద్ద కొబ్బరికాయ కొట్టిన జనసేన ఎమ్మెల్యే!