
పెబ్బేరు, క్రైమ్ మిర్రర్:- పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గౌడ కులస్తుల ఈత వనాలపై దాడి చేసిన ఘటన స్థలాన్ని పెబ్బేరు ఎస్సై యుగంధర్ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. సిబ్బందితో చేరుకున్న ఎస్ఐ చుట్టుపక్కల గల ప్రాంతాలను పరిశీలించారు. స్థానికంగా ఉన్న గౌడ కులస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాతపల్లి గ్రామంలోకి వెళ్లి యువకులు, పెద్దలు, అన్ని కులాల వారితో సమావేశం నిర్వహించి సమస్యలున్నప్పుడు తగాదాలకు తావివ్వకుండా శాంతియుతంగా పెద్దల సహకారంతో పరిష్కరించుకోవాలని సూచించారు. గౌడ కులస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపారు.
Read also : సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సూపర్ స్టార్ మేనకోడలు?
Read also : శాంతించిన మొంథా తుఫాను.. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం : మంత్రి అచ్చెన్నాయుడు





