Wednesday, March 18, 2026
Homeఆంధ్ర ప్రదేశ్ఏడాదిలోనే సీన్‌ రివర్స్‌ - మళ్లీ వైసీపీ వైపుకే సీమ ఓటర్లు..!

ఏడాదిలోనే సీన్‌ రివర్స్‌ – మళ్లీ వైసీపీ వైపుకే సీమ ఓటర్లు..!

క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో : ఎన్నికల ముందు జరగాల్సిన సర్వేలు… ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికే జరుగుతున్నాయి. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల పల్స్‌ పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఏడాదికే సర్వేలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది.. ఇప్పుడు వ్యతిరేకత ఉన్నా.. తర్వాత పాజిటివ్‌గా మారే అవకాశాలు ఉంటాయి. మరి.. ఇంత ముందుగా సర్వేలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది.. అంటే.. ఎవరి దగ్గరా సరైన సమాధానం దొరకడంలేదు.

2024 ఎన్నికల తర్వాత నుంచి ఆంధప్రదేశ్‌ రాజకీయాలు కూటమి వర్సెస్‌ వైసీపీ అన్నట్టుగా సాగుతున్నాయి. కూటమి పార్టీల సాయంతో భారీ మెజారిటీతో విజయం సాధించిన టీడీపీ…. వైసీపీని కోలుకోలేని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తోంది. ఎప్పటికప్పుడు… కొత్త వ్యూహాలక పదునుపెడుతోంది. అయితే… పైస్థాయిలో ఎంత చేసినా.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరే ఫైనల్‌. ప్రజల్లో ఎమ్మెల్యేలపై ఉన్న అభిప్రాయమేనే.. వచ్చే ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందే తేలుతుంది. అందుకే.. కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా… పలు సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. పార్టీలు కొన్ని సంస్థలతో సర్వేలు చేయించుకుంటుండగా.. కొన్ని సంస్థలు సొంతంగా సర్వేలు చేస్తుంటాయి.

అయితే.. ఓ సంస్థ చేసిన సర్వేలో కీలక విషయాలు బయటపడ్డాయి. ముఖ్యమంగా రాయలసీమలో మళ్లీ వైసీపీ గాలి మొదలైందట. సీమ ఓటర్లు ఏడాదిలోనే కూటమి నుంచి మళ్లీ వైసీపీకి జంప్‌ అయ్యారట. వాస్తవానికి రాయలసీమ వైసీపీకి కంచుకోట. 2019 ఎన్నికల్లో సీమలో టీడీపీకి దక్కింది మూడు సీట్లే. కానీ 2024కు వచ్చే సరికి వైసీపీకి ఎదురుగాలి వీచింది. బడా లీడర్లు… వైఎస్‌ జగన్‌, అమర్నాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డితో పాటు… దాసరి సుధ, బాలనాగిరెడ్డి, విరూపాక్షి, ద్వారకనాథ్‌రెడ్డి మాత్రమే విజయం సాధించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికే.. అక్కడ సీన్‌ రివర్స్‌ అయ్యిందని సర్వేలో తేలింది. సీమ ప్రజలు.. మళ్లీ వైసీపీకే జైకొడుతున్నట్టు సమచారాం. రాయలసీమలో 33 మంది కూటమి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్టు సర్వే స్పష్టం చేస్తోంది. అందులోని 29 మంది కొత్త ఎమ్మెల్యేలకు.. 2029లో గెలుపు కష్టమేనట. వారు వన్‌టైమ్‌ ఎమ్మెల్యేలుగా మారాల్సిందే అని సర్వేలో తేలింది. అంతేకాదు.. రాయలసీమ నుంచి ఐదుగురు మంత్రులు ఉండగా.. నలుగురు మంత్రుల పనితీరు చాలా పేలవంగా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారట.

నాగబాబు మంత్రి పదవికి బీజేపీ ఎసరు – పవన్‌ స్టాండ్‌ ఏంటంటే..!

అన్నకు వకాల్తా పుచ్చుకున్న కవిత – రూటు మారిందా..!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments