ఆంధ్ర ప్రదేశ్

దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు!… మరి రేవంత్ స్థానం?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :  మన భారతదేశంలో చాలామంది ధనవంతులు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ మన భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా అంబానీ మరియు అదానీ నిలిచారు. అయితే తాజాగా మన భారతదేశంలో అత్యధిక ధనవంతులు గల ముఖ్యమంత్రులు ఎవరిని చాలామందికి అనుమానం ఉండవచ్చు. కాబట్టి మన భారతదేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రి ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Read Also : ట్రెండింగ్ లో GOOD BYE… 2024!

మన భారతదేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలిచారు. చంద్రబాబు నాయుడు నికర ఆస్తి ఏకంగా 931 కోట్లు. కాబట్టి అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా మన భారతదేశంలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలిచారు అని ఏడిఆర్ నివేదిక తెలిపింది. ఇక రెండవ సంపన్న ముఖ్యమంత్రిగా 332 కోట్లతో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండు నిలిచారు.

Also Read : గ్రామస్థాయి రెవెన్యూ అధికారి (వీఎల్‌వో) పోస్టులకు దరఖాస్తుల వెల్లువ..

ఇక కేవలం 15 లక్షల ఆస్తితో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చివరి స్థానంలో నిలిచారు. కాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30 కోట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. ఏ డి ఆర్ నివేదిక ప్రకారం మన భారతదేశంలోని అత్యంత ధనవంతులు గల ముఖ్యమంత్రుల వివరాలను తెలియపరిచింది.ఇప్పటివరకు చాలామంది ప్రజలకు ఈ విషయాలు తెలియకపోవచ్చు. కావున ఈ నివేదిక ప్రకారం వెల్లడించిన అత్యధిక సంపన్న ముఖ్యమంత్రుల జాబితా ను చూసి చాలామంది కూడా ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి :

  1. బన్నీకి బెయిల్ ఇవ్వొద్దు అంటూ కోర్టును కోరిన పోలీసులు!
  2. తాగి రోడెక్కారో అంతే సంగతి.. తెలంగాణ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ!!
  3. ఇంత పెద్ద మొత్తం.. సంధ్య థియేటర్‌లో సంచలనం సృష్టించిన ‘పుష్ప 2’!!
  4. కొత్త ఏడాది… కొత్త మోసాలు !… జాగ్రత్త?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button