
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్య భారీ వర్షాలు కురిసాయి. కొద్ది రోజుల నుంచి పడుతున్నటువంటి భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని కృష్ణ మరియు గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే తాజాగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో.. కృష్ణ అలాగే గోదావరి నదులకు వచ్చినటువంటి వరదలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇప్పటికీ శ్రీశైలం మరియు నాగార్జునసాగర్ డ్యాం గేట్స్ ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్న.. మరో కొద్ది రోజుల్లో డ్యామ్ గేట్స్ మూసే అటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం గోదావరిలో ధవలేశ్వరం వద్ద ఇన్ఫ్లో మరియు ఔట్ ఫ్లో 12.34 లక్షల క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు భద్రాచలం వద్ద 39.5 అడుగుల నీటిమట్టంతో గోదావరి ప్రవహిస్తుంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 4.73 లక్షల క్యూసెక్కులు కాగా… అవుట్ లో 5.14 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఇక నాగార్జునసాగర్ అవుట్ ఫ్లో 4.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద 3.92 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతూ ఉంది. దాదాపు పది రోజుల క్రితం ఇవే జల ప్రాజెక్టులు భారీ వరదతో పూర్తిగా నిండిపోయాయి.
Read also : చనిపోయినా కూడా ప్రజల మనసు గెలిచారు.. కళ్ళు, భౌతిక కాయం దానం!
అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టులలో వరద క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఈ సంవత్సరం ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రాజెక్టులు అలాగే పలు ముఖ్య నగరాలు జలమయమయ్యాయి. ఈ భారీ వర్షాల కారణంగా ఎంతో మంది ఆస్తిపరంగానూ అలాగే ఆరోగ్యపరంగానూ నష్టపోయారు. భారీ వర్షాల వల్ల భారీ వరదలు కొన్ని ప్రాంతాలను ముంచేత్తాయి. క్రమంగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో.. ప్రాజెక్టులకు వచ్చేటువంటి వరదలు కూడా తగ్గిపోవడంతో ప్రజలు ఈ వరదల నుండి ఉపశమనం పొందుతున్నారు.
Read also : చనిపోయినా కూడా ప్రజల మనసు గెలిచారు.. కళ్ళు, భౌతిక కాయం దానం!