
జగిత్యాల జిల్లా,క్రైమ్ మిర్రర్:-
సామాన్యుడికి హక్కులు ఉంటాయని రాజ్యాంగం చెబితే.. ఆ హక్కుల గురించి చెప్పాల్సిన బాధ్యత తమకు లేదని గొల్లపల్లి మండల అధికారులు ప్రాక్టికల్‌గా నిరూపించారు. మల్లన్నపేట్ గ్రామంలో శనివారం నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవం ఒక వింతైన వేడుకలా సాగింది. హక్కుల మాట దేవుడెరుగు.. కుర్చీలు కూడా కరువే!సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారుల కోసం స్టేజీలు, సోఫాలు, ఏసీలు ఉంటాయి. కానీ ఇక్కడ సీన్ రివర్స్! ప్రజలకు దిశానిర్దేశం చేయాల్సిన ఎంపీడీవో, తహసీల్దార్, ఎస్ఐ గారలు అటువైపు కన్నెత్తి చూడటమే పాపమని భావించారో ఏమో.. అసలు అడ్రస్ లేరు. ఎంతలా అంటే, అక్కడ కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా లేక ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ నేలపై చాప పరుచుకుని కూర్చోవాల్సి వచ్చింది. బహుశా “నేల విడిచి సాము చేయకూడదు” అనే సామెతను అధికారులు ఇలా పాటిస్తున్నారేమోనని జనం నవ్వుకుంటున్నారు.
Read also : పేద విద్యార్థుల కోసం కేంద్రప్రభుత్వం విద్యాలక్ష్మి పథకం
ఆఫీసు దాటి రాలేని ‘అతిథులు’ రెవెన్యూ & ఎంపీడీవో ఆఫీస్: పెద్ద సార్లకు రావడం ఇష్టం లేకపోయినా, మొక్కుబడిగా ఒక ఆర్‌ఐ (RI)ని, ఒక జూనియర్ అసిస్టెంట్‌ను పంపి ‘మేము ఉన్నాం’ అనిపించారు.
పోలీస్ శాఖ: రక్షణ కల్పించాల్సిన ఖాకీలు అసలు రూటే మార్చేశారు. ఒక్క పోలీస్ అధికారి కూడా అక్కడ కనిపించకపోవడం గమనార్హం.”ఏదైనా రిబ్బన్ కటింగ్ ఉంటే పోటీ పడి వచ్చేవారు.. కానీ ప్రజలకు అవగాహన కల్పించే ఇలాంటి ‘బోర్’ ప్రోగ్రాములకు మా విలువైన సమయాన్ని ఎందుకు కేటాయించాలి?” అని అధికారులు మనసులో అనుకుంటున్నారేమో అని స్థానికులు సెటైర్లు వేస్తున్నారు. కింద కూర్చున్నా తగ్గని ఉత్సాహం అధికారులు గైర్హాజరైనా, సౌకర్యాలు లేక నేల మీద కూర్చున్నా.. కార్యక్రమం మాత్రం ఆగలేదు. సర్పంచ్ సిద్దెంకి లక్ష్మి మల్లారెడ్డి, ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్, ఉపసర్పంచ్ స్వామి ముత్యాల, డిక్కీ జిల్లా కో-ఆర్డినేటర్ నల్ల శ్యాం తదితరులు నేలపైనే కూర్చుని పౌరుల హక్కుల గురించి గొంతు విప్పారు. అధికారులు ఏసీ గదుల నుండి బయటకు రాకపోవడం వల్ల పౌరహక్కులు హరించుకుపోవు గానీ, అధికారుల మీద ప్రజలకున్న గౌరవం మాత్రం ‘నేల’పాలవుతుంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు గొల్లపల్లి అధికారుల నిద్రను చెడగొట్టి, ప్రజల వద్దకు పంపిస్తారో లేదో చూడాలి!
Read also : 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాల్సిన అవసరం ఉంది : సోనూసూద్





