సినిమా

రజనీకాంత్ ను వెండితెరకు పరిచయం చేసిన నిర్మాత మృతి..!

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- లెజెండరీ నిర్మాత ఎం.శరవణన్ తాజాగా తుది శ్వాస విడిచారు. AVM స్టూడియోస్ అధినేతగా మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. ఇప్పటికే వృద్ధాప్య సమస్యలతో పోరాడుతూ ఉన్న ఈ లెజెండరీ నిర్మాత శరవణన్ చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇవాళ తెల్లవారుజామున అనారోగ్యం కారణంగానే నిర్మాత మృతి చెందారని అతని సన్నిహితులు అలాగే కుటుంబ సభ్యులు మీడియాకు తెలియజేశారు. కేవలం తమిళ భాషలోనే కాకుండా తెలుగు, హిందీ మరియు మలయాళం వంటి భాషల్లో ఏకంగా 300లకు పైగా చిత్రాలను ఈ శరవణన్ నిర్మాత నిర్మించారు. ఇతను మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు అంతగా తెలియకపోయినా తమిళ చిత్ర పరిశ్రమలలో ఒక మంచి గుర్తింపు పొందిన వ్యక్తి. తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్క సినిమా నటుడికి ఇతనిపై ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. రజనీకాంత్ మరియు శివాజీ గణేషన్ వంటి ఎంతోమంది హీరోలను వెండితెరకు పరిచయం చేశారు. ఇతని పేరు తమిళ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ నిర్మాత మన తెలుగు లో సంసారం ఒక చదరంగం, శివాజీ, జెమిని, మెరుపు కలలు, ఆ ఒక్కటి అడక్కు మరియు లీడర్ వంటి ఎన్నో చిత్రాలు తెరకెక్కించారు. ఇప్పటికే నిర్మాత శరవణన్ మృతి చెందారన్న విషయం తెలియగానే తమిళ చిత్ర పరిశ్రమల్లోని నటులు తోటి సన్నిహితులు మాత్రమే కాకుండా ఇతర భాష చిత్ర నటులు కూడా అతనికి సంతాపం తెలియజేస్తున్నారు. పలువురు ప్రముఖ నటులు మరియు దర్శకులు అలాగే నిర్మాతలు ఇతని అంత్యక్రియలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.

Read also : Renuka Chowdhury: కొనసాగుతున్న ‘కుక్క’ వివాదం.. పార్లమెంట్ లో రేణుక వ్యవహారంపై దుమారం!

Read also : చేజింగ్ లో రికార్డ్.. అదరగొట్టేసారు అంతే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button