
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్ :- మన భారతదేశంలో ఎంతో మంది ప్రజలు అప్పులు చేస్తున్నారని తాజాగా కేంద్ర గణాంకాల శాఖ నివేదిక పేర్కొంది. వివిధ పద్ధతులలో ప్రజలు అలాగే ప్రభుత్వాలు కూడా విపరీతంగా అప్పులు చేస్తున్నాయని ప్రకటించింది. ఈ అప్పుల విషయంలో మన భారతదేశంలోని రెండు తెలుగు రాష్ట్రాలు మొదటి, రెండవ స్థానాలలో నిలిచాయి అని కేంద్ర గణాంకాల శాఖ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవగా తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 43.7% తో మొదటి స్థానంలో నిలవగా… రెండవ స్థానంలో తెలంగాణ 37.2%తో నిలిచింది. మరోవైపు కేరళ 29.9%తో మూడో స్థానంలో నిలిచింది.
ఎక్కువ అప్పులు చేస్తున్నా రాష్ట్రాలు :-
1. ఆంధ్రప్రదేశ్ – 43.7%
2. తెలంగాణ – 37.2%
3. కేరళ – 29.9%
4. తమిళనాడు – 29.4%
5. కర్ణాటక -23%
6. చతిస్గడ్ – 6.5%
7. ఢిల్లీ – 3.2%
అత్యల్పంగా ఢిల్లీలో చాలా తక్కువ మంది అప్పులు చేస్తున్నట్లు గుర్తించారు. ఇక మిగతా రాష్ట్రాల్లో దాదాపు ప్రజలందరూ కూడా అప్పులు ఎక్కువగా చేస్తున్నట్లు వెల్లడించారు. దీనికి రాజకీయ నాయకులు కూడా కారణమని మరి కొంతమంది వాదిస్తున్నారు. ఉచిత పథకాలు ఎక్కువ ఇస్తున్న కారణంగా ప్రజలు కూడా వాటికి అలవాటు పడిపోయారని మండిపడుతున్నారు. ముందు రాజకీయ నాయకుల తీరు మారితే ప్రజల తీరు కూడా మారిపోతుంది అని మరి కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు… ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
Read also :తెలంగాణకు పొంచి ఉన్న వర్షపు ముప్పు.. ఎన్ని రోజులు అంటే?
Read also : మూడవ వన్డేలో మన తెలుగు ప్లేయర్ దూరం అవ్వడానికి కారణం ఇదే!





