
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- వీధి కుక్కల విషయం పట్ల సుప్రీంకోర్టు చాలానే జాగ్రత్తలు వహిస్తుంది. ఈ కుక్కల విషయంలో సుప్రీంకోర్టు అధికారులకు ఇప్పటికే ఆదేశాలను కూడా జారీ చేసింది. వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి అని ఆదేశాలను జారీ చేసింది.
Read also : నేడే చివరి టీ20.. జట్టులో కీలక మార్పులకు అవకాశం?
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు:- విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద ఉండే వీధి కుక్కలకు వెంటనే షెల్టర్లను ఏర్పాటు చేయవలసిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే నేషనల్ హైవే మరియు ఎక్స్ప్రెస్ హైవేలపై యజమానులు లేనటువంటి పశువులను గోశాలలకు తరలించాలి అని ఆదేశించింది. ఈ విద్యా సంస్థలు, బస్టాండ్లు మరియు రైల్వేస్టేషన్ల లాంటి బహిరంగ ప్రదేశాల చుట్టూ కూడా ఫెన్సింగ్ నిర్మించాలి అని వెల్లడించింది. అలాగే ఈ కుక్కలకు సంతాన ఉత్పత్తి నియంత్రణ చికిత్స చేశాక అదే చోట వదలకుండా.. వేరే షెల్టర్స్ లోకి తీసుకువెళ్లాలి అని కోరింది. ఇలా చేయని పక్షంలో అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని సుప్రీంకోర్టు పేర్కొంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే నేషనల్ హైవే శాఖ అధికారులు ఈ ఆదేశాలను అమలు చేయాలి అని నిర్ణయించింది.
Read also : నేడే చివరి టీ20.. జట్టులో కీలక మార్పులకు అవకాశం?
Read also : హ్యాపీ బర్త్డే CM సాబ్.. అంత ఈజీగా అయితే పీఠం దక్కలేదు?





