తెలంగాణ

జర్నలిస్టుల హక్కులను హరించే కొత్త జీవోను సవరించాలి

నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో, క్రైమ్ మిర్రర్:- తెలంగాణలో జర్నలిస్టుల హక్కులను హరించే విధంగా జారీ చేసిన జీవో నెంబర్ 252 సవరించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (TUWJ – హెచ్ 143) మరియు తెలంగాణ జర్నలిస్టు ఫోరం (TJF), తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ (TEMJU) జర్నలిస్ట్ సంఘాలు శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీ నిరసన, ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జర్నలిస్టు పాలసీని ప్రకటిస్తూ జారీ చేసిన జీవో 252 జర్నలిస్టు సమాజానికి తీరని నష్టం కలిగిస్తుందని ఆ సంఘాల నాయకులు అన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెచ్ 143 జిల్లా అధ్యక్షుడు ఎం చంద్రశేఖర రావు, రాజేష్ గౌడ్, శేఖరా చారి,తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడు ఖానాపురం ప్రదీప్, సత్యం తదితరులు మాట్లాడుతూ జర్నలిస్టుల అక్రిడేషన్ పాలసీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు రద్దు చేయడం, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులక్రిడేషన్లను కుదించడం ద్వారా జర్నలిస్టుల హక్కులను హరించడమే అవుతుందన్నారు.

Read also : కొత్త సంవత్సరం 2026కు శుభారంభం కావాలంటే ఒకసారి ఇలా చేసి చూడండి!

రెండు కార్డుల సిద్ధాంతంతో జర్నలిస్టుల మధ్య చిచ్చుపెట్టే విధానాన్ని మానుకోవాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. లోపా భూ ఇష్టమైన జీవో 252 తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్రంలో గతంలో 23 వేల మంది జర్నలిస్టులకు ఇచ్చిన విధంగా ప్రస్తుతం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ అక్రిడేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టుల హక్కులకు అనుగుణంగా ఉన్న గత జీవో 239 స్ఫూర్తికి గండి కొట్టే విధంగా ప్రస్తుతం తీసుకొచ్చిన కొత్త జీవో 252 ఉందనీ దానిని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ జీవోను వెంటనే రద్దు చేసి జర్నలిస్టులు అందరికీ ఒకే విధానాన్ని కొనసాగించాలన్నారు .అక్రిడేషన్లకు కోతలు పెట్టడం జర్నలిస్టుల మధ్య చిచ్చు పెట్టడం వంటి చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో జీవో నెంబర్ 252 ద్వారా పత్రికలు, పత్రికా రంగానికి ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి కేబుల్ టీవీ జర్నలిస్టు రంగానికి కూడా సమస్యగా పరిగణమించే ప్రమాదం ఉన్నందున ఈ జీవో ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి జీవో 252ను సవరించి జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాలను అడ్డుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలను సాగిస్తామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవో చంద్రశేఖర్ కు జీవో 252 ను రద్దు చేయాలని, రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని అందించారు.

Read also : కెరీర్ ఒత్తిళ్ల ప్రభావం.. యువతలో దెబ్బతింటున్న మానవ సంబంధాలు!

ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెచ్ 143 జాతీయ నాయకులు జెమిని సురేష్, హౌదేకార్ ఉమా శంకర్, రాష్ట్ర నాయకులు వంగ శ్రీనివాస్ గౌడ్, నాగశేషి లతోపాటు ఫోటో వీడియో జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడు కపిలవాయి రాజు లతోపాటు సీనియర్ జర్నలిస్టులు రామ లక్ష్మయ్య, అహ్మదుల్లా ఖాన్, మహమ్మద్ సాజిద్, ఆవుల భాస్కర్ బాబు, పులిజాల సత్యం, బాలస్వామి, లాలయ్య, సుధాకర్ రెడ్డి, రామకృష్ణ, మాసయ్య, సునిగిరి సురేష్, మహమ్మద్ సాదిక్, మహమ్మద్ ఇర్ఫాన్, రమేష్, మహమ్మద్ రహీం, విజేందర్ రెడ్డి, డెస్క్ జర్నలిస్టులు నరసింహ యాదవ్, కేబుల్ టీవీ జర్నలిస్టులు 19tv శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్ట్ ల ధర్నాకు టిడబ్ల్యూజెఎఫ్ మద్దతు
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెచ్ 143 ఆధ్వర్యంలో జీవో 252 ను నిరసిస్తూ శనివారం నిర్వహించిన నిరసనకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ప్రత్యక్ష ఆందోళనలో ఆ సంఘం నాయకులు టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా కో కన్వీనర్ రవికాంత్ పులిజ్వాల, కిషోర్ వెంకట్ శివ తిరుపతి, సైదులు, మహమ్మద్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button