
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో కూడా రాణిస్తూ ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపులు తెచ్చుకుంటున్నారు. కానీ రాజకీయాల్లో మాత్రం ఎమ్మెల్యేలు, మంత్రులు మరియు సీఎం మహిళలు తప్పించి మిగతా సర్పంచ్, ఎంపీటీసీ లేదా జడ్పిటిసి వంటి వాటికి మహిళలు నిలబడినా కూడా రూలింగ్ చేసేది మాత్రం వారి భర్తలే. ఎందుకంటే.. తెలంగాణలో తాజాగా స్థానిక సంస్థలు ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన వారు గెలిస్తే వారి బర్తలే రూల్ చేయడం అనేది సర్వసాధారణమైపోయింది. పేరు మాత్రం మహిళలది అయినప్పటికీ పెత్తనం మాత్రం మొత్తం పురుషులే ముందుండి చూసుకుంటున్నారు. మహిళలను చాలాచోట్ల రబ్బర్ స్టాంపు గాని చూస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని తాజాగా మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తూ ఫైర్ అవ్వడమే కాకుండా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. వీటిపై తీసుకుంటున్నటువంటి చర్యలకు సంబంధించి ఈనెల 22వ తేదీలోపు రాష్ట్రాలు మరియు యూనిటీలు కచ్చితంగా నివేదికలు సమర్పించాలి అని కీలక ఆదేశాలను ఆదేశించింది. ఇప్పటినుంచి అయినా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని.. ఎవరి రిజర్వేషన్లు వారే పాటించాలి అని సూచించారు. మహిళలు కూడా ఇటువంటి కీలక సందర్భాలలో వారి నిర్ణయాలు వారి భర్తలు కాకుండా వారే తీసుకోవాలి అని
.. మహిళలు తలుచుకుంటే ఏమి చేయగలరు నిరూపించాలి అని తెలియజేసేలా ప్రతి ఒక్క మహిళలు ముందుకు సాగాలి అని కోరారు.
Read also : అన్నంత పని చేసిన తమన్.. థియేటర్ లో స్క్రీన్లు కాలిపోయాయి
Read also : గిల్ పూర్తిగా విఫలం.. జైస్వాల్ రావాల్సిందే..?





