
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ తన మార్ఫింగ్ ఫోటోల గురించి తీవ్రంగా ఆందోళన చెందారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి తన ఏఐ మార్ఫింగ్ డీప్ ఫేక్ ఫోటోలు పై కీర్తి సురేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ నిరాశచెందారు. ఇలా మార్ఫింగ్ చేసిన ఫేక్ ఫోటోలు నన్ను చాలా రోజులు పాటు తీవ్రంగా బాధపెట్టాయని… నిజంగానే నేను అలా ఫోజ్ ఇచ్చానా అనే అనుమానం గురించి ఆలోచించే స్థితికి చేరుకున్నాను అని కీర్తి సురేష్ తాజాగా ఒక సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో భాగంగా తన గతం విషయాలను పంచుకున్నారు. ఎంతోమందికి సహాయంగా నిలిచేటువంటి టెక్నాలజీ ప్రస్తుతం కొన్ని విషయాలలో అదుపుతప్పుతుంది అని వ్యాఖ్యానించారు. ఇది పెద్ద పెద్ద సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు అలాగే సామాన్య ప్రజలకు కూడా ముప్పుగా మారుతుంది అని మరోవైపు నటి ఆండ్రియా హెచ్చరించారు. డీప్ ఫేక్ అలాగే ఏఐ మార్ఫింగ్ పై పోలీసులు నిఘా ఉంచాలి అని.. లేదంటే సామాన్య ప్రజలతో పాటు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వీటికి గురై బాధపడాల్సి వస్తుంది అని తెలిపారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖ సెలబ్రిటీల ఏఐ మార్ఫింగ్ డీప్ ఫేక్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. భవిష్యత్తులో ఇలానే సెలబ్రిటీల ఫోటోలను ఉపయోగించి మరింత దిగజారుడు పనులకు తోడ్పడే అవకాశాలు ఉన్నాయని పలువురు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి డీప్ ఫేక్ ఫోటోలు తయారు చేసేటువంటి వ్యక్తుల పై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటివి మరోసారి ప్రత్యక్షం అవ్వవు అని సూచిస్తున్నారు.
Read also : గిల్, శ్రేయస్ ఆడడం కష్టమే.. మరి వన్డేలకు కొత్త కెప్టెన్ ఎవరు?
Read also : క్షణికావేశంలో ఏ చిన్న తప్పు చేసిన జీవితాంతం కుమిలిపోతారు : సజ్జనార్





