
క్రైమ్ మిర్రర్,జాతీయ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంతవరకు కూడా కొన్ని గంటల పాటు ఈ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఆప్స్ పైనే కాలాన్ని గడుపుతున్నారు. ఇక తాజాగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటేనే మెంటల్ హెల్త్ అనేది బాగుంటుంది అని హార్వోర్డ్ మెడికల్ స్కూల్ స్టడీలో తేలింది. కొన్ని విషయాలపై హార్వర్డ్ మెడికల్ స్కూల్ స్టడీ చేయగా అందులో కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. కేవలం ఒక వారం రోజులు పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటే మెంటల్ హెల్త్ అనేది చాలా బాగా మెరుగవుతుంది అని తేల్చి చెప్పింది.
Read also : అభివృద్ధికి అడ్డుపడిన వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు : సీఎం చంద్రబాబు
యాంగ్జైటీ 16.1%, డిప్రెషన్ 24.8%, ఇన్ సోనియా లక్షణాలు 14.5% తగ్గినట్లుగా గుర్తించారు. ఇక ఈ రోజుల్లో యువకులు ప్రతిరోజు రెండు గంటల పాటు సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ ను వాడుతున్నట్లుగా ఫోన్ డేటాతో స్పష్టంగా తెలుస్తుంది అని వెల్లడించారు. డిటాక్స్ టైంలో సోషల్ మీడియా వాడకం వారానికి 1.9 అవర్స్ నుంచి 30 నిమిషాలకు తగ్గిపోయిందని తెలిపింది.ఈ మిగతా టైమ్స్ లో పలువురు వ్యాయామం చేస్తూ ఉండగా మరి కొందరు స్వేచ్ఛగా బయటకు తిరగడానికి వెళ్తున్నారు అని తెలిపింది.
Read also : ప్రారంభమైన ఫైనల్ మ్యాచ్.. గెలుపు ఎవరిది?





