
క్రైమ్ మిర్రర్, న్యూస్ :- భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మన దేశ ఆపర కుబేరులు అయినటువంటి గౌతమ్ అదాని మరియు ముఖేష్ అంబానీ ఇద్దరు కూడా స్పందించారు. మన భారతదేశానికి మా నుండి ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తామని ప్రకటించారు. యుద్ధంలో పాకిస్తాన్ ను ఓడించి తీరాలని ఇండియాకు సలహా ఇచ్చారు. పాకిస్తాన్తో యుద్ధం నడుమ ఇండియాకు పూర్తిగా సహాయ సహకారాలు అందించడమే కాకుండా మద్దతుగా నిలుస్తామని తెలిపారు. ఈ యుద్ధం నేపథ్యంలోనే మన ఐక్యత అలాగే నిజమైన బలం బయటకు వస్తుందని అదాని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇక మరోవైపు దేశ సాయిధబలగాలకు అండగా ఉంటామంటూ, దేశ ప్రజలకు ఏది కావాలన్నా చేసి చూపిస్తామని ముకేశ్ అంబానీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మన భారతదేశానికి అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు రిలయన్స్ కుటుంబం సిద్ధంగా ఉంటుందని ఈ యుద్ధం సందర్భంగా వెల్లడించారు. దీంతో దేశంలోని ప్రతి ఒక్కరు ఈ ధనవంతులైనటువంటి గౌతమ్ ఆదానికి మరియు ముకేశ్ అంబానీ కి హ్యాట్సాఫ్ చెప్తున్నారు. యుద్ధం నేపథ్యంలో వీళ్లు బయటకు రావడమే చాలా గొప్ప అనుకుంటే… పూర్తిగా ఏ అవసరం వచ్చినా చేస్తామంటూ తెలపడం మరో ఎత్తని ప్రశంసిస్తున్నారు.