
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- ప్రస్తుత కాలంలో ప్రయాణికులకు మెట్రో మార్గం అనేది చాలా సులభంగా మారిపోయింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు ముఖ్య నగరాల్లో ఈ మెట్రో అనేది అందుబాటులో ఉంది. తద్వారా ప్రయాణికులు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కోకుండా అతి తక్కువ సమయంలోనే తమ గమ్యాలకు చేరుకోగలుగుతున్నారు. ఇక తాజాగా చెన్నైలో జరిగిన ఒక ఆసక్తికర ఘటన సోషల్ మీడియాలో వైరల్అవుతూ ఉంది. చెన్నైలో మెట్రో రైలు ఉన్నట్టుండి మధ్యలోనే ఆగిపోయింది. కొన్ని టెక్నికల్ గ్లిచ్ సమస్యల కారణంగా ఇవాళ ఉదయం సెంట్రల్ మెట్రో మరియు హైకోర్టు స్టేషన్ల మధ్య సబ్ వే పై మెట్రో ట్రైన్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దాదాపు పది నిమిషాల పాటు మెట్రోలోనే ప్రయాణికులు ఉండిపోవాల్సి వచ్చింది. ఈ మెట్రో బోగిలో విద్యుత్ సరఫరా బంద్ అవడం కారణంగానే మధ్యలోనే ఆగిపోయిందని… దగ్గర్లోని స్టేషన్కు ప్రయాణికులు అందరూ కూడా నడిచి వెళ్లాలి అంటూ కొద్దిసేపటికే మెట్రో నుంచి అనౌన్స్మెంట్ రావడంతో అందులోని ప్యాసింజర్లు అందరూ కూడా పక్కనే ఉన్నటువంటి టన్నెల్ గుండా నడుచుకుంటూ వెళ్లిపోయారు. ప్రస్తుతం టన్నెల్లో నడుస్తున్నటువంటి ప్రయాణికుల దృశ్యాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటనను చూసి ప్రతి ప్రేక్షకుడిని కూడా నవ్వులు పూయిస్తుంది.
Read also : స్థానిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి “గుజ్జుల శంకర్”
Read also : బ్రేకింగ్ న్యూస్.. ఐపీఎల్ కు మూడో విధ్వంసకర ప్లేయర్ రిటైర్మెంట్!





