Thursday, March 19, 2026
Homeతెలంగాణఅంగరంగ వైభవంగా పాతగుట్ట లక్ష్మీనరసింహుల కళ్యాణం

అంగరంగ వైభవంగా పాతగుట్ట లక్ష్మీనరసింహుల కళ్యాణం

యాదగిరిగుట్ట,క్రైమ్ మిర్రర్:- కళ్యాణ వేదిక విద్యుత్ కాంతులు విరజిమ్ముతుండగా..భక్తుల జయజయ ధ్వానాలు.. గోవింద నామస్మరణలు.. మంగళ వాయిద్యాలు.. మిన్నంటగా యాదగిరిగుట్ట అనుబంధ ఆలయం పాతగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రకరకాల పూలమాలతో అలంకృతి గావించగా గజవాహనంపై స్వామివారు, ముత్యాల పల్లకిలో అమ్మవారిని ఊరేగింపుగా వేదికకు చేర్చారు. వివిధ పుష్ప మాలికలు, వజ్ర వైధూర్యాలతో అలంకృతుడైన శ్రీ స్వామివారిని పెళ్ళి కుమారుడుగా, అమ్మవారిని పెళ్ళి కుమార్తెగా ముగ్ధమనోహరంగా ఆలయ పూజారులు ముస్తాబు చేయగా అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు శ్రీనారసింహుడు లక్ష్మీదేవిని పరిణయమాడి లక్ష్మీ నరసింహుడుగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు తమ బాగ్యోత్సవాలుగా భావించి కమనీయంగా రమణీయంగా పారాయణికులు, రుత్వికులు, పండితుల వేద మంత్రాలు, ఆస్థాన విధ్వాంసుల మంగళ వాయిద్యాలు నడుమ కన్నుల పండుగగా బ్రహ్మోత్సవ వేడుక సాగింది. మొదట విశ్వ క్సేన పూజ నిర్వహించి కళ్యాణ మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్వామి అమ్మ వార్లకు ఆలయ ఈవో జే. భవానిశంకర్, అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నరసింహా మూర్తి పట్టువస్త్రాలను సమర్పించారు. మంగళ వాయిద్యాలతో స్వామివారి కళ్యాణ తంతును ప్రారంభిం చారు.

Read also : చివరి T20 లో విధ్వంసాన్ని సృష్టించిన ఇషాన్ కిషన్.. భారత్ ఘన విజయం

పిదప బ్రహ్మాది దేవతలు హాజరై ఆశీర్వదించి పాంచరాత్రాఆగమశాస్త్ర రీత్యా యాజ్ఞికులు, అర్చకులు జీలకర్ర బెల్లం కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్ష్మీ దేవి తండ్రి సముద్రుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేయగా 10:02 గంటలకు భక్తుల జేజే ద్వానాలు మిన్నంటగా స్వామివారు అమ్మవారికి సూత్రాధారణ గావించారు. స్వామివారి కల్యాణ వేడుకకు విచ్చేశారు. ఈ సందర్భంగా కవచమూర్తు లను దర్శించుకుని ప్రత్యేక
పూజలు చేశారు. ఈ వేడుకల్లో ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, బట్టలు సురేంద్రాచార్యులు, ఉప ప్రధానార్చకుడు కొడకండ్ల మాధవాచార్యులు, డీఈవో దోర్భల భాస్కర్ శర్మ, ఏఈవోలు నాగుల మహేష్ గౌడ్, కలెక్టర్ హనుమంతరావు, సాదునేని మధుకర్, స్థానికులు పాల్గొన్నారు.

Read also : క్రైమ్ మిర్రర్ పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments