Sunday, February 22, 2026
Homeతెలంగాణఎరువుల డీలర్ల మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేదాయె

ఎరువుల డీలర్ల మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేదాయె

క్రైమ్ మిర్రర్, ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన రేపాక గణేష్,నర్సింహా అనే రైతులు రామన్నపేటలో కోరమాండల్ కంపెనీ యూరియా 6 బస్తాలు కొనుగోలు చేసి, యూరియా చల్లడానికి బస్తా విప్పి చూడగా మట్టి పెడ్డలు లాంటివి వచ్చాయని, అది కల్తీ యూరియానేమో అని పత్రికల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. మండల వ్యవసాయ అధికారి ఈ విషయమై విచారణ చేపట్టినట్టు, రైతు రేపాక గణేష్ దగ్గర నుండి సంజాయిషీ పత్రం తీసుకున్నట్టు కూడా ఒక లేఖ మండల వ్యవసాయ అధికారికి రైతు ఇచ్చినట్టు ప్రచారంలో ఉంది. ఇంత తొందరగా డీలర్ల తరపున ఉండి రైతు నుండి సంజాయిషీ ఇప్పించుకున్న అధికారులు, గతంలో రైతులు తమ వడ్లు ఐకేపీ, పిఎసిఎస్ కోనుగోలు కేంద్రాల్లో ఏఈఓ పరిశీలించిన ధాన్యాన్ని కాంటా వేశాక దుమ్ము, తాలు వడ్లలో వచ్చాయని, మిల్లర్లు అభ్యంతర పెట్టినప్పుడు, ధాన్యం లోడులను దించుకోవడానికి నిరాకరించినపుడు సంబందిత అధికారులు ఒక్కరైనా రైతుల తరపున మాట్లాడారా? ఆ విషయం గురించి విచారణ చేపట్టారా? అధికారులకు ఎరువుల డీలర్ల మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేకపాయెనే అని రైతులు వాపోతున్నారు. మరి దీనికి సంభందిత అధికారులు ఏమని సమాధానమిస్తారో చూడాలి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments