
– కాలేశ్వరం గోదావరి ప్రాంతంలో దొరికిన కలప దుంగలు
– స్మగ్లింగ్ కు పాల్పడ్డ దొంగలు మాత్రం దొరకలేదు
– దొంగల పరారీ వెనుక అధికారుల హస్తం ఉందా?
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ :-
జయశంకర్ జిల్లా, మహాదేవపూర్ మండలం కాలేశ్వరం గోదావరి పరివాహక ప్రాంతంలో శుక్రవారం అడవి శాఖ అధికారులు కలప దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కానీ కలప స్మగ్లింగ్ కు పాల్పడిన స్మగ్లర్లు మాత్రం తప్పించుకున్నారు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. గురువారం రాత్రి మహారాష్ట్రలోని సిరొంచ ప్రాంతం నుంచి – గోదావరి మీదుగా టేకు దుంగలు కాళేశ్వరం తీరానికి చేరాయని అందిన సమాచారంతో పోలీసు అటవీశాఖ అధికారులు సంయుక్తంగా గోదావరి తీరంలో రెక్కీ నిర్వహించారు. శుక్రవారం తెల్లావారు జామున గోదావరి సమీపంలో 19 దుంగలు అధికారులు గుర్తించారు. కానీ దుంగలను స్మగ్లింగ్ చేస్తున్న దొంగలు మాత్రం పరారీ అయ్యారు దీంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దుంగలను పట్టుకున్న అధికారులు స్మగ్లర్లను ఎందుకు వదిలేసినట్లు?… అడవి శాఖ అధికారుల నిర్లక్ష్యం తోనే స్మగ్లర్లు తప్పించుకున్నారా? లేదా అడవి శాఖ అధికారులు స్మగ్లర్లతో కుమ్మక్కయ్యారా?.. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి స్మగ్లింగ్ చేసిన దొంగలను మరియు వారికి సహాయం సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read also : లైన్ దాటితే సహించేది లేదు.. కామినేని, బాలకృష్ణ పై సీఎం సీరియస్!
Read also : ట్రంప్ వల్లే యుద్ధం ఆగిపోయింది.. శాంతికి మారుపేరు ట్రంప్ : పాకిస్తాన్ ప్రధాని