
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- తమిళ యాక్టర్ విజయ్ సేతుపతి తాజాగా జరిగిన ఇంటర్వ్యూ కార్యక్రమంలో భాగంగా కొన్ని కీలక విషయాలను తెలిపారు. విజయ్ సేతుపతి నటించిన “గాంధీ టాక్స్” మూవీ రేపు విడుదల కానున్న నేపథ్యంలో గతంలోని తన జీవితం గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఇతరులకు సహాయం చేయడంలోనే అసలైన కిక్ ఉంటుంది అని అన్నారు. తాను చేసే ప్రతి పనిలోను కూడా సంతోషం వెతుక్కుంటాను అని.. చేసే పనిలో సంతోషం ఉంటేనే ముందుకు సాగుతాను అని అన్నారు. అలాగే ప్రతి నెల కూడా ఉపాధి లేని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి లక్షన్నర రూపాయలను ఖర్చు చేస్తాను అని అన్నారు. ఈ విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియకపోయినా తాజాగా తనే చెప్పడంతో ప్రతి ఒక్కరికి తెలిసింది. ఉపాధి లేనివారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అంటే కచ్చితంగా నేను డబ్బు సంపాదించాలి అని.. అలా సినిమాలు ద్వారా వచ్చిన డబ్బునే ఎంతో కొంత ఉపాధి లేని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఖర్చు చేస్తున్నాను అని అన్నారు. ఇక సినిమాల్లోకి రాకముందు వరకు కూడా ఒక అకౌంటెంట్గా పనిచేశాను.. ఆ జాబు లోను కూడా తృప్తి పొందాను అని విజయ్ సేతుపతి తెలిపారు. కాగా బిగ్ బాస్ షో అలాగే సినిమాల్లో నటిస్తూ విజయ్ సేతుపతి చాలా బిజీగా కాలాన్ని గడుపుతున్నారు. వీటితో వచ్చే ఆదాయం తోనే ఇతరులకు సహాయం చేయగలుగుతున్నాను అని పేర్కొన్నారు.
Read also : ఊపిరి పీల్చుకున్న కోహ్లీ ఫ్యాన్స్.. “అన్న వచ్చేసాడోయ్ “
Read also : Fake Doctor: జ్వరం వచ్చిందని సూది వేశాడు.. నురగలు కక్కుకొని చనిపోయిన పేషెంట్





