
గట్టుప్పల, క్రైమ్ మిర్రర్:- మండల కేంద్రంలో ప్రముఖ ప్రాచీన దేవస్థానమైన శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయం నిర్మాణానికి భక్తులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో, సోమవారం దేవాలయ నిర్మాణానికి స్తంభ(శంఖు)స్థాపన కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. తెల్లవారుజామున గణపతి పూజ,స్వస్తివాచనం, వాస్తుపూజ మరియు నవగ్రహపూజ,హోమాలు కీసరగుట్ట ఆగమ శాఖ ప్రధాన అధ్యాపకులు బ్రహ్మశ్రీ పుల్లేటికుర్తి గణపతి శర్మ, బ్రహ్మశ్రీ మాడ పాపయ్య శర్మ,శివ శ్రీ పురాణ మఠం శివానందం అయ్యవారు,బ్రహ్మశ్రీ మాడ సుధాకర్ శర్మ,బ్రహ్మశ్రీ మాడా వెంకటరమణ శర్మ,శివశ్రీ పురాణమఠం విద్యాసాగర్ అయ్యవారు,బ్రహ్మశ్రీ పాల పవన్ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా వేదమంత్రాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గ్రామస్థులతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుండి వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి దివ్య దర్శనం చేసుకొని నవధాన్యాలను సమర్పించి తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి అనుగ్రహం పొందారు. భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. భక్తులను సాంస్కృతిక, నృత్య కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
దేవాలయ నిర్మాణానికి విరాళాలు అందించిన దాతలకు శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో నిర్మాణ కమిటీ గౌరవ అధ్యక్షులు యిడం శ్రీనివాస్,అధ్యక్షులు యిడం భాస్కర్,యిడం వెంకటేశం,మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం,మాజీ ఎంపీపీ అవ్వారి గీత శ్రీనివాస్, జెల్ల షణ్ముఖి, మాజీ సర్పంచ్ నామని జగన్నాథం,మాజీ ఎంపీటీసీ చెరిపెల్లి భాస్కర్,జెల్ల సూర్యకాంత్,దోర్నాల అంజయ్య,దోర్నాల నరేందర్, భక్తులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి ..
-
తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.
-
మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని?
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?
-
ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..