
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిశాయి. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది రోజులపాటు వినాయకుని విగ్రహాలకు భక్తితో, నిష్టంగా పూజలు చేసి ప్రజలు వాళ్ల యొక్క భక్తిని చాటుకున్నారు. వినాయకుని విగ్రహాల వద్దకు వచ్చినటువంటి భక్తులకు ప్రసాదాలను పంచిపెట్టి చివరకు నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిపారు. హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణేష్ ఉత్సవాలు, నిమజ్జనాలు ప్రశాంతంగా ముగియడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ అధికారులను అభినందించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. నిత్యం అహర్నిశలు పనిచేసినటువంటి పోలీస్ శాఖ , మునిసిపల్, రెవెన్యూ, విద్యుత్ మరియు రవాణా, పంచాయతీరాజ్ శాఖ అలాగే ఇతర శాఖలకు సంబంధించి సిబ్బందికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
Read also : BCCI పవర్ ఏంటో తెలిపే న్యూస్ ఇది!.. క్రైమ్ మిర్రర్ స్పెషల్ న్యూస్!
దాదాపు తొమ్మిది రోజులపాటు భక్తులు వినాయకుని విగ్రహాలకు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఘనంగా వీడ్కోలు పలికారని… ఇలాంటి సమయంలో ప్రజలు కూడా అధికారులకు ఎటువంటి ఇబ్బందులు కలగనివ్వలేదు కాబట్టి తోటి ప్రజలకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే ఈ ఏడాది వినాయకుని లడ్డు వేలం పాట కూడా చాలా బాగా జరిగింది. ఈసారి లడ్డు వేలం పాట బాలపూర్ లడ్డు రెండు కోట్లకు పైగా పలికింది. వినాయకుని లడ్డు వేలం పాటలో ఇతర మతాల వ్యక్తులు కూడా పాల్గొని లడ్డు పాట పాడడంతో మతసామరస్య ఘటనలు కూడా వెలుగు చూశాయి. దీంతో అందరూ కలిసి బలంగా సంబరాలు చేసుకోవాలని కోరిక ఉంటే ఎటువంటి మత విభేదాలు అడ్డు రావని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిరూపించారు. ఏది ఏమైనా కూడా వినాయకుని ఉత్సవాలు ఈ ఏడాది చాలా ఘనంగా జరిగాయి.
Read also : పాకిస్తాన్ లో మరో విషాదం.. క్రికెట్ ఆడుతుండగా బాంబు పేలుడు?.. ఒకరు మృతి!