క్రీడలు

క్రికెట్ ను శాసిస్తున్న భార్యాభర్తలు.. ప్రత్యర్థి భారత్ అయితే పూనకాలే!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎంతోమంది క్రికెటర్లు తమ ప్రతిభ కనబరిచి నేడు ఎంతోమంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మేం చెప్పబోయే వాళ్ళిద్దరూ ప్రపంచ క్రికెట్లో పవర్ఫుల్ జోడి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకరేమో తన బోలింతో బ్యాట్స్మెన్ లకు చుక్కలు చూపిస్తుంటే… మరోవైపు తనేమో బ్యాటింగ్ తో బౌలర్లకు చుక్కలు చూపిస్తుంది. ముఖ్యంగా వీరిద్దరికి ప్రత్యర్థిగా భారత్ ఉంటే మాత్రం పూనకాలు వస్తాయని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే వారిద్దరు ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకరు ఆస్ట్రేలియన్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్, అతని భార్య అలీసా హీలి. వీళ్ళిద్దరూ ఆస్ట్రేలియా జుట్టు తరఫున కీలక సభ్యులుగా కొనసాగుతున్నారు. మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా జట్టు తరఫున స్టార్ బౌలర్గా ప్రత్యర్థులను వణికిస్తుంటే… మరోవైపు అతని భార్య హీలి ఆస్ట్రేలియా మహిళల జట్టుకు కెప్టెన్ గా తన హవాని కొనసాగిస్తుంది.

Read also : ఎమ్మెల్యే కసిరెడ్డి కాలేజీలో రూ.కోటి చోరీ

ఇక తాజాగా జరిగినటువంటి మహిళల ప్రపంచ కప్ 2025 లో భాగంగా వైజాగ్ వేదికగా టీమిండియాతో జరిగినటువంటి మ్యాచ్ లో హీలీ అద్భుతమైన సెంచరీ చేసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించింది. ఈ టోర్నీలో కెప్టెన్ హీలి దారుణమైన ప్రదర్శన కనబరచుగా… భారత్ పై మాత్రం తన విశ్వరూపాన్ని చూపించింది. మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ 331 పరుగులకు ఆల్ అవుట్ అవ్వగా… 332 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి కూడా విజయాన్ని సాధించింది. దీంతో మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేదించిన జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. కాగా మిచెల్ స్టార్క్ మరియు హీలీ వీరిద్దరు కూడా పదేళ్లపాటు ప్రేమించుకుని 2016లో పెళ్లి చేసుకున్నారు. సిడ్నీకి చెందినటువంటి వీరిద్దరూ దాదాపు తొమ్మిది ఏళ్ళ వయసు నుంచే పరిచయం ఉంది. 2013లో స్టార్క్ ఇక లాభం లేదు అని తన ప్రేమను హీలీకి చెప్పగా అందుకు తను కూడా ఓకే చెప్పింది. దీంతో ఇద్దరు కూడా వివాహ బంధంతో ఒకటి అయ్యారు.

Read also : తుది శ్వాస విడిచిన లక్ష్మారెడ్డి.. మధ్యాహ్నం మూడు గంటలకు అంత్యక్రియలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button