
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్ : ఒకప్పుడు దక్షిణ భారత సినీరంగంలో వెలుగులు చిందించిన నటీమణుల్లో నిషా నూర్ ఒకరు. తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో నటిస్తూ తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించారు. అగ్రహీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని వరుస విజయాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రత్యేకంగా కమల్ హాసన్ నటించిన టిక్ టిక్ టిక్ చిత్రం, అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన శ్రీ రాఘవేంద్ర నిషా నూర్‌కు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చాయి. ఈ చిత్రాల విజయాలతో ఆమె పేరు దక్షిణాది సినీ వర్గాల్లో విస్తృతంగా వినిపించింది. అయితే, కెరీర్ ఉచ్చస్థితిలో ఉన్న సమయంలోనే ఆమె జీవితంలో అనూహ్య మలుపులు చోటుచేసుకున్నాయి.
సినిమాల అవకాశాలు తగ్గిన దశలో ఒక నిర్మాత ఆమెకు సహాయం చేస్తానని చెప్పి నమ్మించి, బలవంతంగా వ్యభిచార కుపంలోకి నెట్టేశాడన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సినీ పరిశ్రమలో రక్షణ లేకపోవడం, మద్దతు లేని పరిస్థితులు ఆమె జీవితాన్ని చీకటి దిశగా నడిపించాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ దుర్ఘటనల అనంతరం నిషా నూర్ హెచ్ఐవీ బారిన పడినట్లు సమాచారం. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆమె తీవ్ర ఆర్థిక, మానసిక కష్టాలను ఎదుర్కొన్నారని తెలిసింది. చివరికి తగిన వైద్యం, సంరక్షణ లేకుండా ఆమె మృతి చెందింది.
Read More : పోలీసుల బట్టల ఊడదీస్తాం.. BRS మాజీ ఎమ్మెల్యే వార్నింగ్ (VIDEO)
ఒకప్పుడు వెండితెరపై వెలుగొందిన నటి ఇలా విషాదాంతం చెందడం అప్పట్లో సినీ ప్రపంచాన్ని కలచివేసింది. నిషా నూర్ జీవితం, సినీ రంగంలో వెలుగుల వెనుక ఉన్న చీకటి కోణాన్ని ప్రతిబింబించే ఉదాహరణగా మారింది. స్టార్‌డమ్ తాత్కాలికమని, సరైన రక్షణ, మద్దతు లేకపోతే ప్రతిభావంతులైన కళాకారుల జీవితాలు ఎలా దారి తప్పుతాయో చూపించే విషాద గాథగా ఆమె కథ ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు.





