
క్రైమ్ మిర్రర్, తమిళనాడు న్యూస్:- ఒకప్పుడు హీరోగా ప్రజాదారణ పొంది, ఎన్నో సినిమాలను సూపర్ హిట్ గా అందించిన సుమన్ నేడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఒకప్పుడు మన టాలీవుడ్ మెగా హీరో చిరంజీవి కి పోటీగా వచ్చిన నటుడు సుమన్.. ఒకవైపు తెలుగు చిత్ర పరిశ్రమలో మరోవైపు తమిళనాడు చిత్ర పరిశ్రమల్లో హీరోగా ఎన్నో సినిమాలు నటించాడు. ఆ తరువాత అతని జీవితంలో జరిగిన కొన్ని అనుకోని సంఘటనల వల్ల సుమన్ కెరీర్ పడిపోయింది. మళ్లీ చాలా రోజుల తర్వాత సినిమాల్లోకి వచ్చిన సుమన్ హీరోగా నటించిన సినిమాలు అంతగా వర్కౌట్ కాకపోవడంతో… క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రతి ఒక్కరిని మెప్పించాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు.
Read also : ఒక ప్రధానమంత్రిని లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటారా?.. రేవంత్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు : కిషన్ రెడ్డి
అయితే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో హీరో సుమన్ మాట్లాడుతూ నాకు రాజకీయ పార్టీల నుండి ఎన్నో అవకాశాలు లభించాయి. ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని.. మా పార్టీలో చేరమని చాలానే ఆఫర్స్ వచ్చాయని అన్నారు. కానీ ఇప్పటివరకు ఏ పార్టీలో చేరడం, ఏ పార్టీకి పనిచేయడం లాంటివి చేయలేదు కానీ.. ఇప్పుడు రాజకీయాల్లో ప్రయత్నం చేద్దామని.. కచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో అడుగు పెడతాను.. దీని కోసమే సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నానని!.. హీరో సుమన్ తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు.
అయితే ఈ మాటతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీలో కూడా చేరడని అర్థమయిపోయింది. కానీ గతంలో చంద్రబాబు నాయుడుకు, జగన్మోహన్ రెడ్డికి అలాగే పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా మాట్లాడారు. ఈ మూడు పార్టీలలో ఏ ఒక్క పార్టీకి కూడా ప్రత్యేకంగా సపోర్ట్ చేయలేదు. ఇక సుమన్ కచ్చితంగా తమిళనాడు రాజకీయంలోని ఏదో ఒక పార్టీలో చేరాల్సిందే. అయితే ఒకవేళ తమిళనాడు రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని అనుకుంటే సుమన్ ఏ పార్టీలో చేరతాడో?.. అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ లేదా బీజేపీ పార్టీలో చేరుతాడా?.. లేదా డిఎంకె, అన్నా డీఎంకే పార్టీలో చేరుతాడా?.. వీటన్నిటిని పక్కన పెట్టేసి విజయ్ కొత్తగా పెట్టిన టీవీకే పార్టీలో చేరుతాడా అనేది ప్రశ్నార్ధకంగా మిగిలిపోయింది. అయితే ఈ అన్ని పార్టీలలో.. విజయ్ పార్టీలోనే ఎమ్మెల్యే సీట్ చాలా సులువుగా వస్తుంది. కొత్తగా పెట్టిన పార్టీ కాబట్టి ఎక్కడ ఎమ్మెల్యే సీట్ అడిగినా ఇచ్చే అవకాశం ఉండడంతో… హీరో సుమన్ టీవీకే పార్టీలోనే చేరడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read also : తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు భారీ వర్షాలు సూచన!.. అలర్ట్?