తెలంగాణ
Trending

బీసీ బంద్ లో పాల్గొని రాజకీయ నాయకులని షేక్ చేసిన కవిత వారసుడు..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పెద్ద ఎత్తున బంద్ నిర్వహిస్తున్న విషయం ప్రతి ఒక్కరి తెలిసిందే. అయితే ఈ బంద్ లో ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. జాగృతి పార్టీ చీఫ్ కవిత కొడుకు ఆదిత్య ఈ బంద్ లో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కవిత కావాలనే తన వారుసుడిని రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వైదొలిగి నేరుగా కొత్త పార్టీని స్థాపించి.. ముందడుగులు వేస్తున్న కవిత తాజాగా తన కొడుకుని బీసీ బందులో పాల్గొనేలా చేయడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపోయేలా చేసింది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు కూడా ఈ విషయం షాకింగ్ గా అనిపిస్తుంది. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో భాగంగా కొడుకుని సిద్ధం చేస్తున్నట్లుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా చర్చిస్తున్నారు. మరోవైపు కేటీఆర్ కొడుకు హిమాన్షు కూడా అక్కడక్కడ పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడుతూ కనిపించడం.. రాష్ట్ర భవిష్యత్తుకు వీళ్లు ఇప్పటినుంచి పునాదులు వేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఫ్యూచర్లో కేసీఆర్ మనవళ్లు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి రాష్ట్ర రూపురేఖలను మార్చే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయని మరి కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ బీసీ బంద్ లో పాల్గొన్న కవిత వారసుడు ఆదిత్య కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ మనమే కాబట్టి… ఈ రిజర్వేషన్లు భవిష్యత్తులో చాలా మందికి ఉపయోగపడతాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఈ బంద్ లో పాల్గొనాలని పిలుపునిచ్చాడు. దీంతో కవిత తన కొడుకుని ఇప్పటినుంచే రాజకీయాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.

Read also : బంద్ ఎఫెక్ట్… దీపావళి, దుకాణదారుల పై ప్రభావం చూపుతోందా?

Read also : ఏపీకి భారీ వర్ష సూచన.. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలు జాగ్రత్త!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button