
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న , ఎమ్మెల్సీ కవిత పై అభ్యంతర వ్యాఖ్యలు చేయగా… కవిత డిజిపి జితేందర్ కు మల్లన్న పై ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరారు. తీన్మార్ మల్లన్న తో మాట్లాడడానికి వెళ్లినటువంటి జాగృతి కార్యకర్తలపై ఎందుకు గన్ మెన్స్ కాల్పులు జరిపారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్న ఆదేశాలు లేకుండానే కాల్పులు జరిపారా అని.. ప్రశ్నించారు. వెంటనే కాల్పులు జరిపిన గన్ మెన్సును డిస్మిస్ చేయాలని డీజీపీకి ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు.
అలాగే తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ ఇంకా స్పందించలేదని ఎమ్మెల్సీ కవితా తీవ్రంగా విమర్శించారు. ఈ అంశాన్ని ఇక పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నానని తాజాగా జరిగిన మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా బి ఆర్ ఎస్ పార్టీ కవితను పట్టించుకోవట్లేదు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక బిసి రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెన్స్ సరైనదని కవిత అన్నారు. దీనిని బిఆర్ఎస్ పార్టీలోని నేతలు విమర్శించడం అలాగే వ్యతిరేకించడం అనేది తప్పు అని అన్నారు. నేను ఎంతోమంది నిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్ కు మద్దతు ఇచ్చానని కవిత చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నాయకులు తనదారికి రావాల్సిందేనని క్లియర్గా స్పష్టం చేశారు.
బీహార్ లో కరెంట్ ఫ్రీ, ఎన్నికల వేళ సీఎం నితీష్ కీలక ప్రకటన!
సిరియాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్, కీలక ప్రాంతాలపై వైమానిక దాడులు!