
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో : టీడీపీ, జనసేన మధ్య గొడవలు మొదలయ్యాయా..? రెండు పార్టీల అధినేతలు ఉప్పు-నిప్పుగా ఉంటున్నారా..? అంటే అవుననే అంటున్నారు కొందరు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పవన్ కళ్యాణ్ కనిపించకపోవడానికి కూడా అదే కారణమన్న చర్చ జరుగుతోంది. నాగబాబు వ్యాఖ్యలతో పిఠాపురంలో కూడా టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టు రాజకీయం నడుస్తోందని సమాచారం.
కూటమి పార్టీలతో ఎన్ని విభేదాలు ఉన్నా.. రాష్ట్ర ప్రజల కోసం కలిసే ఉంటామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. మరి ఆ మాటకు కట్టుబడి ఉంటున్నారా..? మాట ఇచ్చినంత తేలిక కాదు నిలబెట్టుకోవడం. రాజకీయాల్లో అయితే అది మరీ కష్టం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విషయంలోనూ అదే జరుగుతున్నట్టు… తాజా పరిణామాలు చెప్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పవన్ కళ్యాణ్ కనిపించలేదు. గతంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. అంతేకాదు.. కలెక్టర్లకు సలహాలు, సూచనలు కూడా ఇచ్చారు. మరి.. ఇప్పుడు ఏమైంది. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు ఎందుకు హాజరుకాలేదు..? అన్న ప్రశ్న నుంచి… టీడీపీ, జనసేన మధ్య గ్యాప్ పెరుగుతోందన్న చర్చ మొదలైంది.
కలెక్టర్ల కాన్ఫరెన్స్ విషమయే కాదు… పిఠాపురంలో కూడా టీడీపీ-జనసేన మధ్య అగ్గి రాజుకుంది. జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో… పిఠాపురం టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నారు. పైగా.. పిఠాపురంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు కూడా టీడీపీ సీనియర్ నేత వర్మను పిలవడంలేదు. దీంతో.. పరిస్థితి మరింత ఆగ్రహిస్తోంది స్థానిక టీడీపీ కేడర్. ఎలాగైనా.. జనసేనకు తమ సత్తా చాటాలని గట్టిగా డిసైడ్ అయ్యినట్టు సమాచారం. ఈ పరిస్థితిని సరిదిద్దడానికి టీడీపీ, జనసేన అధ్యక్షులు ప్రయత్నించకపోవడం కొసమెరుపు. దీంతో.. పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టు ఉంది. పిఠాపురం ఒక్కటే కాదు… తిరుపతిలోనూ టీడీపీ-జనసేన మధ్య దూరం ఉంది. ఇదిలా కొనసాగితే… ఈ దూరం మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.