తెలంగాణ

గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

క్రైమ్ మిర్రర్, మాడుగులపల్లి:-గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం ప్రజల జీవితాల్లో మార్పులు తేవడం కోసం నిరంతరం కృషి చేస్తుందని సినిమాటోగ్రఫీ, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లు అన్నారు. నల్గొండ జిల్లా, మాడుగులపల్లి మండల కేంద్రంలోని 60 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం 14.7 కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ మండల ఆఫీస్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించారని మళ్లీ అదే ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డులు మంజూరు చేశామని అన్నారు. గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి కూడ బిఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించాలని అన్నారు. నలగొండ జిల్లాను తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి పథంలో ముందుండె విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా మంత్రులకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై మంత్రులకు ఘనంగా స్వాగతం పలికారు. స్థానికులు మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు మాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ కార్యాలయాల అన్ని ఒకే చోట సమీకరణతో మా అవసరాలు సులభంగా తీర్చబడతాయి. ఈ పథకాలు మా జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయి” అని కొనియాడారు… ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ ఇలా త్రిపాటి, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, ఎమ్మార్వో సురేష్ కుమార్ ఎంపీడీవో తిరుమల స్వామి, ఏపిఎం చంద్రశేఖర్, తాజా మాజీ జెడ్పిటిసి పుల్లెంల సైదులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు కట్టేబోయినా రామలింగయ్య యాదవ్, యువ నాయకులు గడ్డం పురుషోత్తం రెడ్డి, కళ్ళు శ్రీనివాస్ రెడ్డి, సైదిరెడ్డి, యాదగిరి, ఎరుకల వెంకన్న, నరేష్, శ్రవణ్ కుమార్, ఉశయ్య, వేముల సందీప్, తదితర ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

కంటతడి పెట్టిస్తున్న కస్తూరిబా కష్టాలు.. బిల్డింగ్ సదుపాయం లేక చిన్నారుల అవస్థలు.

దివికేగిన నట కోట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button