
క్రైమ్ మిర్రర్, వలిగొండ :- యాదాద్రి భువనగిరి జిల్లా,వలిగొండ మండల పరిధిలోని నాగారం ధాన్యం కొనుగోలు కేంద్రంలో, వలిగొండ మార్కెట్ యార్డులో వరి ధాన్యపు గింజలు తడిసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. తడిసిన ధాన్యాన్ని అధికారులతో పరిశీలించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిందని,గతంలో ఎన్నడు లేని విదంగా 12 సెం.మీ వర్షం కురిసిందని అన్నారు. తడిసిన వరి ధాన్యాన్ని ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని,రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు వడ్లను ఎతైన ప్రదేశంలో పోసుకోవాలన్నారు.రైతులకు అవసరమైన టార్పాలిన్లు అందించి ధాన్యం తడవకుండా చూడాలని అధికారులకు సూచించారు.
Read also : బొడ్రాయి ఉత్సవానికి వడ్డేపల్లి దంపతుల రూ.16లక్షల విరాళం
Read also : విజయవాడ హైవేపై రోడ్డుప్రమాదం