
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. మరీ ముఖ్యముగా లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరి రాకపోకలకు అలాగే నివసించడానికి కూడా ప్రజలకు చాలా ఇబ్బందిగా మారిపోయింది. మరి కొన్ని లోతట్టు ప్రాంతాలు అయితే ఏకంగా చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంలో సోషల్ మీడియాలో అయితే ఒక ప్రచారం జరుగుతుంది. అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి గురించి…
Read also : జాతీయ పతాకాన్ని అవమానించిన ఫారెస్ట్ అధికారి – బూట్లు విప్పకుండా జెండా ఆవిష్కరణపై విమర్శలు
భారీ వర్షాలకు రాజధాని అమరావతి ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది అంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రచారం అంతా కూడా అవాస్తవమని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మొత్తం కూడా ఫేక్ అని కొట్టి పారేసింది. పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గం లోని కంభంపాడు వాగు పొంగి లెవెల్ చాప్టర్ పై నుంచి పారుతున్న నీటి దృశ్యాలను అమరావతి అంటూ తప్పుదోవ పట్టిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ ఖమ్మంపాడు వాగు అనేది అమరావతి రాజధానికి ఏకంగా 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ప్రాంతం దృశ్యాలను తీసుకువచ్చి అమరావతి మునిగిపోయిందంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్లారిటీ ఇచ్చింది. అమరావతి ప్రాంత ప్రజలనే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ.. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే తీవ్రంగా హెచ్చరించింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియాలో ఇకపై చేస్తే మాత్రం వారిని చట్ట పరంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేసింది.
Read also : స్వాతంత్ర దినోత్సవం నాడు టీడీపీ సంబరాలు.. పులివెందులలో టీడీపీ జెండా!