
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదు అని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నేటి నుంచి బంద్ చేపట్టిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, పీజీ, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కాలేజీలు మూసివేశారు. ప్రభుత్వం ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తుందో అప్పటివరకు కాలేజీలు తెరవబమని హెచ్చరించారు. అయితే తాజాగా కాలేజీలు బంద్ కొనసాగుతున్న కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించట్లేదని ఉన్నత విద్యాసంస్థల ఫెడరేషన్ చైర్మన్ రమేష్ నాయుడు వ్యాఖ్యలు చేశారు. మీరు స్పందించకపోతే నిరసన ఉదృతంగా చేస్తామంటూ హెచ్చరించారు. రేపటి నుంచి జరిగే డిగ్రీ పరీక్షలను కూడా బహిష్కరిస్తామని తెలిపారు. మాకు రావాల్సినటువంటి బకాయిలలో సగం వెంటనే విడుదల చేయాలి అని కోరారు. నవంబర్ 8వ తేదీన హైదరాబాదులో భారీ సభ, నవంబర్ 11వ తేదీన 10 లక్షల మంది విద్యార్థులతో చలో హైదరాబాద్ పేరుతో నిరసన కూడా చేపడుతామని తెలిపారు. అంతేకాకుండా ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తుంది అని చైర్మన్ రమేష్ నాయుడు పేర్కొన్నారు.
Read also :అయ్యో పాపం… సౌత్ ఆఫ్రికా జట్టును వెంటాడుతున్న దురదృష్టం..!
Read also : నేటి నుంచి బంద్.. మరి బకాయిలు చెల్లిస్తారా?





