తెలంగాణ

ప్రభుత్వం మారిన పూర్తి కానీ ప్రభుత్వ పాఠశాల..వర్షంలో తడుస్తూ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు!

క్రైమ్ మిర్రర్, మహేశ్వరం:- పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలలు అంటే ఈ ప్రభుత్వానికి అంత చులకన,కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడి చేయడం తప్ప మెరుగైన పాలన ప్రజలకు అందించలేక పోతుందని విమర్శించారు రామ కృష్ణ రెడ్డి,బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో ఉన్న ప్రభుత్వ పాఠశాల నిర్మాణ పనులు పరిశీలించిన అధ్యక్షుడు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి సందర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థ పై ప్రత్యేకమైన దృష్టి సారించామని గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసింది ఏం లేదని రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు.గత ప్రభుత్వం లో ప్రారంభమైన నిర్మాణ పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా పూర్తి కాలేదని విద్యార్థులు వర్షంలో తడుస్తూ పరీక్షలు రాయవలసిన దృష్టితి బడంగ్ పేట్ కార్పొరేషన్ ప్రభుత్వ పాఠశాల లో వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పది రోజుల క్రితం విద్యా కమిషన్ మెంబర్ పరిశీలించి వెళ్లిన నిర్మాణం పనుల్లో ఎలాంటి పురోగతి లేదని పాఠశాలలు ప్రారంభోత్సవము కంటే ముందే నిర్మాణం పూర్తి కావాల్సిన భవనం ఇంకా పూర్తి కాలేదని మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం లో పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రైవేట్ పాఠశాలలకు కొమ్ముకాస్తున్నారని విమర్శలు గుప్పించారు.మేయర్ గా ఉన్నప్పుడు పాఠశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దృష్టి సారించాలని నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని రామ కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించిన భవనం మధ్య లోనే ఆగిపోయిందని, ఈ విషయం పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని రామ కృష్ణారెడ్డి నిలదీశారు.నెల రోజుల్లో నిర్మాణ పనులు పూర్తి కాకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అగ్రిసెట్టి సైదులు జి,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

వాకింగ్‌కు వెళ్లిన యువకుడికి విద్యుత్ షాక్‌ – మృతి

రంగారెడ్డి జిల్లా పోల్కంపల్లిలో ఆలయ దొంగతనం కలకలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button