
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- జనసేన పార్టీకి ఎలక్షన్ కమిషనర్ తాజాగా శుభవార్త తెలిపింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా జనసేన మంచి గుర్తింపు పొందగా తాజాగా తెలంగాణ రాష్ట్రంలోనూ జనసేన పార్టీకి ప్రాంతీయ పార్టీగా గుర్తింపు ఇస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈమధ్య స్థానిక సంస్థల ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తును కేటాయించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే 2024 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ 21 కి 21 ఎమ్మెల్యేలు మరియు రెండు ఎంపీ సీట్లు దక్కించుకొని 100% స్ట్రైక్ రేట్ తో జనసేన అద్భుత విజయాన్ని సాధించి రికార్డు సృష్టించిగా ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రిజిస్టర్ పార్టీ హోదా నుంచి గుర్తింపు పొందిన పార్టీగా జనసేన మారింది. ఇకపై ఏ పార్టీకి కూడా గాజు గ్లాస్ చిహ్నాన్ని కేటాయించరు.
మంత్రులకు ర్యాంకులు ప్రకటించిన సీఎం!… 10వ స్థానంలో పవన్ కళ్యాణ్?
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఇస్తున్నట్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. కాగా 2014లో ఆవిర్భవించిన జనసేన ఆ ఏడాది ఎన్నికలలో పోటీ చేయలేదు. ఆ తర్వాత 2019లో జనసేన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పోటీ చేయగా కేవలం రాజోలు ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలిచింది. కానీ తిరిగి 2024 ఎన్నికలలో ఏకంగా 21 ఎమ్మెల్యేలు రెండు ఎంపీ సీట్లు జనసేన పార్టీ సొంతం చేసుకుంది.
ఆక్రమణాలను తొలగిస్తున్న హైడ్రా!.. ఒకే రోజు పలుచోట్ల తొలగింపు?