
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ముగిసాయి. మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా దాదాపు నాలుగు వేలకు స్థానాలలో ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది. మొత్తంగా చూసుకుంటే నిన్న ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు పూర్తిగా సత్తా చాటారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 2,200 పైగా స్థానాల్లో గెలిచారు. ఇక బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 1100 కు పైగా స్థానాలలో విజయం సాధించారు. ఇక మూడవ పార్టీ బిజెపి 150 కీ పైగా స్థానాలలో విజయం సాధించారు. దీంతో ఎటు చూసినా కూడా మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీనే జోరు మీద ఉంది.
Read also : Panchayat Elections: ఒక్క ఓటుతో గెలిచిన “అదృష్టవంతులు” వీళ్లే..
ఇక తొలి విడత ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫోకస్ రెండో విడత పైన పెట్టారు. ఈనెల 14వ తేదీన జరగబోతున్నటువంటి రెండో విడత పోలింగ్లోను ఇదే జోష్లో కొనసాగాలి అని హస్తం పార్టీ పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తుంది. ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ సైతం రెండవ విడతలో సత్తా చాటాలని చూస్తోంది. ఇక బిజెపి ఈ రెండో విడతలో పూర్తిస్థాయిలో తమ అభ్యర్థులు గెలిపొందేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఎలక్షన్ కమిషన్ అధికారులు తెలిపిన విధంగా ఈనెల 14న జరగబోయేటువంటి రెండో విడత లో మొత్తం 4332 పంచాయితీలకు పోలింగ్ జరగనుంది అని అలాగే 38,322 వార్డులకు ఆరోజు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రెండో విడతపై రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్క పార్టీ కూడా ఫోకస్ చేస్తుంది. ఇప్పటికే మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థులు కూడా సత్తా చాటుతూ వస్తున్నారు.
Read also : క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. 100 రూపాయలకే టికెట్లు!





