
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- టాలీవుడ్ నటుడు, విలన్ ఫిష్ వెంకట్ గురించి సోషల్ మీడియాలో చాలానే న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిపాలైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. సమయంలో ఫిష్ వెంకట్ ఫ్యామిలీ ఎన్నో విధాలుగా ఎంతోమందిని ఆర్థిక సహాయం చేయమని కోరారు. అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ లేదా హీరోల నుంచి కానీ ఇప్పటివరకు ఎటువంటి ఆర్థిక సాయం మాత్రం అందలేదు. అయితే ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో ఉన్న అతని గురించి మీడియాలో తాజాగా ఎన్నో రకాలుగా న్యూస్లు వచ్చాయి. అయితే ఇందులో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయినట్లుగా.. ఎవరో ప్రభాస్ అసిస్టెంట్ తమకు కాల్ చేసి సహాయానికి ముందుకు వస్తున్నట్లుగా వెంకట్ తనయురాలు వీడియో రూపంలో తెలియజేసింది. కానీ ఆ తరువాత ఆ కాల్ అనేది ఫేక్ కాల్ అని… ఫోన్ చేసింది ప్రభాస్ పిఏ కాదని మళ్లీ ఆమె స్పష్టం చేసింది.
కాగా గతంలో చిరంజీవి అలాగే కొంతమంది సర్జరీ చేయడానికి ముందుకు రాగా.. ఫిష్ వెంకట్ తన స్నేహితుడిని నమ్మి మోసపోయినట్లుగా ఆమె చెప్పింది. ఇక మొత్తానికి శని రంగం నుంచి ఏ ఒక్కరు కూడా సహాయం చేయడం పక్కన పెడితే… ఫిష్ వెంకట్ ట్రీట్మెంట్ విషయంలో ప్రస్తుతం ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆయన చికిత్సలు మొత్తం అయ్యే ఖర్చును కూడా తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. తాజాగా ఆసుపత్రికి వెళ్లి మరి ఫిష్ వెంకట్ ను కలిసిన మంత్రి… చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం మేమే భరిస్తామని భరోసా ఇచ్చారు. అప్పటికప్పుడే ఒక లక్ష రూపాయలు మొత్తాన్ని కూడా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు కూడా దెబ్బ తినడంతో ఇవాళ ఈ పరిస్థితికి వచ్చారు. ఇక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సకు ఎలాంటి భయం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.