
మర్రిగూడ,క్రైమ్ మిర్రర్:- మండలంలో రాజపేట తండా గ్రామంలో, టపాసుల గొడవ ప్రాణాల మీదికి తెచ్చింది. చిన్న ఘర్షణతో మొదలై నలుగురు యువకులపై, కత్తులతో దాడి చేసిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది.. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. మండలంలోని రాజపేట తాండ గ్రామపంచాయతీలో గురువారం సాయంత్రం మారగోని చిన్న నరసింహ, ఇంటి పైన, సౌండ్ బాక్సులు పెట్టుకొని పండగ సెలబ్రేషన్ చేస్తుండగా.. టపాకాయలు పేలుస్తూ చుట్టుపక్కల ఇండ్లపైన పడ్డాయని.. కాగా సౌండ్ తక్కువ పెట్టమని పందుల శ్రీకాంత్ చెప్పాడు. దీంతో చిన్నగా గొడవ మొదలైంది.
గీస కత్తులతో నలుగురు వ్యక్తులపై, తీవ్రంగా దాడి చేశారని తెలుస్తుంది..!?దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గాయపడిన వ్యక్తులను స్థానిక 30 పడకల ఆసుపత్రికి తరలించారు. ఒక వ్యక్తికి సీరియస్ ఉండడంతో, వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ కు తరలించారు.. బాధితుల ఫిర్యాదు మేరకు మర్రిగూడ పోలీసులు జరిగిన సంఘటనపై ఆరా తీస్తున్నారు.. గొడవ ఏదైనప్పటికి కత్తులతో యువకులు వీరంగం చేయడంతో, గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.. కత్తులతో దాడులు చేసుకోవడం ఇప్పటివరకు మండలంలో జరగలేదని, గంజాయి బ్యాచ్ రావడం కారణంగానే కత్తులతో దాడి జరిగిందని ప్రజలు ఆరోపిస్తున్నారు..!? ఏది ఏమైనా ప్రస్తుతం జరిగిన దాడిపైన పోలీస్ అధికారులు దృష్టి సారించి.. సమగ్ర దర్యాప్తు చేసి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.






