
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడిచిన ఈ రెండేళ్లలో బీఆర్ఎస్ పార్టీపై పడి ఏడవడం తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి లేచిన దగ్గరనుంచి అబద్ధాల ప్రచారం చేస్తున్నారు అని.. అలా చేసినంత మాత్రాన గత పది సంవత్సరాలలో కెసిఆర్ చేసిన సంక్షేమాన్ని అలాగే అభివృద్ధిని ప్రజలు ఎవరూ కూడా మర్చిపోరు అని హరీష్ రావు స్పష్టం చేశారు. రెండేళ్ల నుంచి టిఆర్ఎస్ పార్టీపై అలాగే కెసిఆర్ మరియు కేటీఆర్ పై అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఏడవడం తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు అని విమర్శించారు. మీరు అవగాహన లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలతో SLBC టన్నెల్లులో దాదాపు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నీళ్లను అక్రమంగా వాళ్ళ రాష్ట్రానికి తరలించకపోతున్న కూడా మీరు మాట్లాడే పరిస్థితులు లేవు. DPR లు రూపొందిస్తున్న కూడా పట్టించుకోవడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరిట మరో యువకుడిని బలి తీసుకున్నారు. ఇక చివరిగా అతను ఫుట్బాల్ ఆటపై ఉన్న శ్రద్ధ ప్రజల పాలనపై లేకపోవడం సిగ్గుచేటు అని టిఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also : Yogi Adityanath: అయోధ్య అయిపోయింది, నెక్ట్స్ టార్గెట్ ఏంటో చెప్పిన యోగీ!
Read also : దేవుడంటే భక్తి లేదు,ఆలయాలంటే లెక్కలేదు : సీఎం చంద్రబాబు





