తెలంగాణ

ఆయిల్ పామ్ సాగులో జిల్లా ఆదర్శంగా నిలవాలి..కలెక్టర్ బాదావత్ సంతోష్

క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి:- ఆయిల్ పామ్ సాగుపై రైతుల దృష్టి సారించాలని, ఆయిల్ పామ్ సాగులో నాగర్ కర్నూల్ జిల్లా ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు.బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని ఊర్కోండ మండలం మాదారం గ్రామంలో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతు శ్రీకాంత్ కు చెందిన 10 ఎకరాల పొలంలో 500 ల మొక్కల ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ హాజరై నారు. మాదారం గ్రామానికి చెందిన రైతు శ్రీకాంత్ తన 10 ఎకరాల పొలంలో 500 మొక్కలతో ఆయిల్ ఫామ్ వ్యవసాయ సాగుకు శ్రీకారం చుట్టిన సందర్భంగా రైతు ను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రత్యేకంగా అభినందించారు. మాదారం గ్రామంలో మరో రైతు కృష్ణారెడ్డి ఆయిల్ ఫామ్ మొదటి క్రాప్ కట్టింగ్, అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి రైతు పొలంలో ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా రైతులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. నాగర్ కర్నూల్ జిల్లా ఆయిల్ పామ్ తోటల సాగుకు అనుకూలంగా ఉన్నట్లు ఆయిల్ పామ్ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు కూడా దిగుబడి బాగుంటుందని, గతంలోనే జిల్లాను సందర్శించి ధ్రువీకరించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సాగుకు ప్రోత్సాహం ఇస్తూ, ఆయిల్ పామ్ పంటను పెంచే దిశగా రైతులకు అవసరమైన సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రైతు పొలంలో నాటిన ఆయిల్‌ పామ్‌ గెలలు, రానున్న నాల్గవ సంవత్సరం నుంచి 30 సంవత్సరాలవరకు దిగుబడి వస్తుందన్నారు. ప్రస్తుతం ఇతర దేశాలనుంచి ఆయిల్‌ దిగుమతి చేసుకుంటుందన్నారు. ఆయిల్‌ పామ్‌ తోటలు అధికంగా వేయడంవలన ఆయిల్‌ మనమే ఉత్పత్తి చేసుకోవచ్చన్నారు. దీని వల్ల రైతులకు దీర్ఘకాలికంగా స్థిర ఆదాయం లభించే అవకాశం ఉంది. రైతులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించి, జిల్లాలో మరింత దిగుబడిని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఇప్పటికే 7 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంట సాగు జరిగిందని, ఆయిల్ పామ్ తోటలను విస్తృతంగా పెంచడం ద్వారా మనమే అవసరమైన ఆయిల్‌ను ఉత్పత్తి చేసుకోగలమని అభిప్రాయపడ్డారు. జిల్లాలో 60 వేల మంది రైతులు 10 ఎకరాల పొలం కలిగిన ఉన్నారని వారందరూ ఆయిల్ ఫామ్ సాగు పై దృష్టి సారించాలని, రైతు పంటల మార్పిడి పద్ధతిలో ఆయిల్ పామ్ ను చేర్చడం వల్ల వారికీ స్థిరమైన ఆదాయం లభించవచ్చు అని కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఉద్యాన శాఖ అధికారి వెంకటేశం, తాహసిల్దార్ యూసఫ్ అలీ, తదితరులు ఉన్నారు.

రాజాసింగ్‌ మళ్లీ బీజేపీలోకే వెళ్తారా..? శివసేనలో చేరిపోతారా..?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన వల్లభనేని వంశీ – కన్నీరుపెట్టుకున్న భార్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button