సినిమా

డిప్యూటీ సీఎం మాటలు నా హృదయాన్ని తాకాయి.. అందుకే అలా చేశాం : నవీన్ పోలిశెట్టి

క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలతో పాటుగా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి “అనగనగా ఒక రాజు” సినిమా కూడా రిలీజ్ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తుంది. ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ గోదావరి జిల్లాలోని జరిగింది. ఇలా ఎందుకు గోదావరి జిల్లాలోని ఎక్కువగా షూటింగ్ జరిపారు అనేదానికి తాజాగా నవీన్ పోలిశెట్టి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. రాజమండ్రిలో పర్యటించినటువంటి హీరో నవీన్ పోలిశెట్టి… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతోనే ఈ “అనగనగా ఒక రాజు” సినిమా షూటింగ్లో ఎక్కువ భాగం గోదావరి జిల్లాలోనే జరిగింది అని స్పష్టం చేశారు.

Read also : ఉమెన్స్ ఐపీఎల్ లో RCB రికార్డు..?

గతంలో పలు సందర్భాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూవీ షూటింగ్స్ ఇకనుంచి జరగాలి అని.. తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎక్కువగా షూటింగ్స్ ప్రాంతాలు ఉన్నాయి అని.. కాబట్టి సినిమా బృందాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నచ్చిన చోట షూటింగ్ చేసుకోవచ్చు అని ఓరిని విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు నా హృదయాన్ని తాకాయి అని నవీన్ పోలిశెట్టి అన్నారు. అలాగే మా సినిమాకు సంబంధించి షూటింగ్స్ ఎక్కడ చేసిన కూడా అధికారులు చాలా సులభంగా పరిమిషన్లు ఇచ్చారు అని… పూర్తిగా సహకారం అందించారు అని తెలిపారు. కాబట్టే ఇంత త్వరగా సినిమాను పూర్తి చేసి సంక్రాంతి కానుకగా గోదావరి జిల్లాలతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి వినోదాన్ని అందించామని తెలిపారు. నిన్న రాజమండ్రిలో జరిగినటువంటి ఓ కార్యక్రమంలో భాగంగా హీరో నవీన్ పోలిశెట్టి అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి పాల్గొని సందడి చేశారు.

Read also : UAE President: 3 గంటల పర్యటన కోసం 6 గంటల ప్రయాణం.. ఏం జరుగుతోంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button