
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ భారీ వర్షాలు కురుస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పెద్ద సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఉన్నటువంటి ప్రధాన నగరాలలో రోడ్లపైనే నీరు నిలిచిపోవడంతో ఒకవైపు జాబ్ చేసే వ్యక్తులు మరోవైపు కూలి పనికి వెళ్లే వ్యక్తులు కూడా ఇళ్లలోనే ఉండిపోవాల్సి వస్తుంది. అనారోగ్యం కారణంగా కొంతమంది ఆసుపత్రికి కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు రైల్వే స్టేషన్స్ మరియు బస్టాండ్స్ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. అధికారులు ఎప్పటికప్పుడు కొన్ని బృందాలతో సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే తాజాగా ఒక లైన్మెన్ చేసిన సాహసానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు.
Read also : బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో భారీ వర్షాలు!
సిద్దిపేట జిల్లాలోని నాగ సముద్రం చెరువు మధ్యలో తెగిపోయిన ఒక విద్యుత్తు లైను ను పునరుద్ధరించేందుకు లైన్మెన్ హైముద్దీన్ అనే వ్యక్తి సాహసం చేసి మరి.. ఒక తాడు సాయంతో చెరువు మధ్యలోకి వెళ్లి స్తంభం ఎక్కి విద్యుత్ కనెక్షన్ అనేది ఇచ్చారు. దీంతో ఇంతటి వర్షంలోనూ… పొంగి పొర్లుతున్న చెరువు మధ్యలోకి వెళ్లిన ఆయన బాధ్యతను నిర్వహిస్తున్న వ్యక్తిత్వాన్ని చూసి.. నేరుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అతన్ని స్పెషల్ గా అభినందించారు. ఇంతటి కష్ట సమయంలో కూడా.. మీ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నందుకు యావత్తు విద్యుత్ అధికారులు అందరిని కూడా అభినందించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు భారీ చెట్లు, స్తంభాలు కూడా నేలకొరుగుతున్నాయి. దీంతో పలు ప్రాంతాలలో ఇప్పటికే విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడుతుంది.
Read also : ఏంటి ఈ సినిమా!.. వార్-2 రివ్యూ, ఫ్యాన్స్ కు పూనకాలే