
క్రైమ్ మిర్రర్, శ్రీకాళహస్తి:- శ్రీకాళహస్తి.. మహాపుణ్యక్షేత్రం. పరమ శివుడు వాయులింగం రూపంలో కొలువైన పుణ్యస్థలం. ఈ ఆలయంలో రాహు-కేతు పూజలు చేస్తే.. దోష నివారణ జరుగుతుందని నమ్మకం. అంతటి పుణ్యక్షేత్రంలో… రహస్యంగా ఏం జరుగుతోంది. ఆడిపల్లల జననాలు ఎందుకు తగ్గుతున్నాయి. శివయ్య కోపగించాడా…? ఇది దేవుడు శాపమా…? లేక మనుషులు చేస్తున్న తప్పిదమా..? శ్రీకాళహస్తిలో ఆడపిల్లల సంఖ్య ఎందుకు తగ్గుతోంది.
తిరుపతి జిల్లాలో సుమారగా వెయ్యి మంది అబ్బాయిలకు 900 మంది అమ్మాయిలు పుడుతున్నారు. జిల్లా లెక్క ఇలా ఉంటే… శ్రీకాళహస్తిలో ఆ లెక్క తప్పుతోంది. ఆడపిల్లల పుట్టుక పడిపోతోంది. 100మంది మగబిడ్డలు పుడితే… ఆడబిడ్డలు 629 మందే పుడుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు… మూడు నెలలుగా ఇదే లెక్క కనిపిస్తోంది. ఎప్పుడూ ఇలా లేంది.. గత మూడు నెలల్లోనే ఇలా ఎందుకు జరుగుతోంది…? తప్పెక్కడ జరుగుతోందని… జిల్లా అధికారులు ఆరా తీశారు. విచారణ కమిటీ వేశారు. విచారణ జరిపి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు కలెక్టర్.
Read also :వరంగల్ కాంగ్రెస్ లో మళ్లీ వార్.. కొండాపై ఎమ్మెల్యే నాయిని సీరియస్
పుణ్యక్షేత్రం కదా… మగబిడ్డలు ఎక్కువ పుట్టడుతున్నారంటే… అందులో దేవుడి మాయ ఏదైనా ఉందేమో అని అనుకుంటారేమో… కానే కాదు… దేవుడి మాయ కాదు.. మానవ కనికట్టు అని కొందరు ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల కాసుల కక్కుర్తి ఫలితమని నొక్కి ఒక్కానిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా లింగ నిర్దారణ పరీక్షలు చేసి.. ఆడబిడ్డ పుట్టబోతుందని ముందే తెలుసుకుని… ఆ బిడ్డను కడుపులోనే చిధిమేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో చిత్తూరులో ఇలాగే జరిగింది. అక్కడ ఓ స్కానింగ్ సెంటర్ ఇలా అక్రమంగా లింగనిర్దారణ పరీక్షలు చేసింది. ఆ బాగోతం బయటపడింది. ఆ స్కానింగ్ సెంటర్ మూతబడింది. అయితే… వారు తిరుపతికి మకాం మార్చినట్టు వార్తలు వస్తున్నాయి. కొన్ని నెలలుగా మొబైల్ స్కానింగ్ పరికరంతో లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్నట్టు సమాచారం. శ్రీకాళహస్తిలోనూ ఇలాంటిదే జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణల్లో నిజమెంతో అధికారులే తేల్చాలి. ఆడబిడ్డల జననాల రేటు తగ్గడానికి కారణాలు కనుగొనాలి. శ్రీకాళహస్తే కాదు.. చుట్టపక్క ప్రాంతాలైన తొట్టంబేడు, ఏర్పేడు మండలాల్లో కూడా ఆడపిల్లల జననాల రేటు తీవ్రంగా పడిపోతోందని సమాచారం. దీనికి కొన్ని స్కానింగ్ సెంటర్లే కారణమన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నా ఆ స్కానింగ్ సెంటర్ల పనిపట్టాలని… ఆడబిడ్డలను కడపులోనే ఛిదిమేయకుండా చూడాలని… సామాజిక కార్యకర్తలు, వామపక్ష నేతలు, ప్రజలు కోరుతున్నారు.
Read also : డ్రిల్లింగ్–బ్లాస్టింగ్ పద్ధతిలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు!