
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ఐపీఎల్-2026 లో భాగంగా నిన్న జరిగినటువంటి మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒక అన్ క్యాప్డ్ ప్లేయర్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది. ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి ఈ స్పిన్ ఆల్ రౌండర్ ప్రశాంత్ వీర్ నిన్న జరిగినటువంటి మినీ వేలంలో అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా అతనిని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపారు. ఏకంగా 14.20 కోట్లు పెట్టి అది కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లాంటి జట్టు అతన్ని కొనుగోలు చేసిందంటే అతని దగ్గర మంచి క్రికెట్ నైపుణ్యం ఉంది అని అర్థమవుతుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికినటువంటి డొమెస్టిక్ క్రికెట్ ప్లేయర్ గా అతను ఒక చరిత్ర సృష్టించాడు అని చెప్పవచ్చు.
Read also : 25 కోట్లతో జాక్ పాట్.. తీరా చూస్తే డకౌట్!.. ఆందోళనలో అభిమానులు?
అయితే ప్రతి ఒక్కరు అనుకుంటున్నట్లు ఈ సూపర్ ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్ జాక్పాట్ వెనుక ఎన్నో విషాద గాధలు ఉన్నాయి. అతను చిన్నప్పటి నుంచి కూడా తన తాతకు వచ్చేటువంటి ఎల్ఐసి పెన్షన్ తోనే ఒకవైపు ఇల్లు మరో వైపు అతని క్రికెట్ జీవితం ఇంతవరకు రాగలిగింది. ఇక 2020లో అతను కూడా చనిపోవడంతో ఇక క్రికెట్ ను వీడాలి అని ప్రశాంత్ నిర్ణయించుకున్నారు. కానీ అనుకోకుండా ప్రశాంత్ కోచ్ రాజీవ్ ఘోయల్ అతని టాలెంట్ ను గుర్తించి శిక్షణకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను సమకూర్చారు. ఇక డొమెస్టిక్ లీగ్ అలాగే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టి నేడు ipl ఫ్రాంచైజీల దృష్టిలో పడటమే కాకుండా భారీ ధరకు సీఎస్కే జట్టులోకి చేరిపోయారు.
Read also : దారుణం.. భార్య, ఇద్దరు బిడ్డలను చంపేశాడు!





