•గతం ఆ భూమిలో గుప్తా నిధుల తోవ్వకాలు జరిగాయా..
•ఆ వ్యాపారి గుప్తా నిధుల కోసమేనా కొనుగోలు చేసింది..
•అనుమాన వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు..
క్రైమ్ మిర్రర్,రంగారెడ్డి :- మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 11, 19, 20, 23లో సుమారు 72 ఎకరాల దేవాలయ భూములు ఉన్నప్పటికీ, గ్రామానికి చెందిన ఓ వ్యాపారి రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లోపాలను అనుకూలంగా మార్చుకుని 27 గుంటల చెన్నకేశవ స్వామి దేవాలయ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇరవై రోజుల క్రితం వచ్చిన ఫిర్యాదుల మేరకు తెలంగాణ దేవాదాయ శాఖ రంగారెడ్డి జిల్లా ఇన్స్పెక్టర్ ప్రణీత్ ఆధ్వర్యంలో అధికారులు స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఫంక్షన్ హాల్ నిర్మాణం జరుగుతున్నట్లు గుర్తించి, ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అలాగే తహసీల్దార్ కార్యాలయంలో పూర్తి వివరాల కోసం దరఖాస్తు చేసి భూమి రికార్డులను పరిశీలించినట్లు తెలిసింది.
గ్రామస్తుల ఆరోపణల ప్రకారం, ఈ దేవాలయ భూముల్లో గతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు సమాచారం. అదే నేపధ్యంలో గుప్త నిధులపై కన్నేసిన ఆ వ్యాపారి నిబంధనలకు విరుద్ధంగా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుని, జియాలజిస్టులతో నివేదికలు తీసుకొని భారీ ఎత్తున ప్రహరీ నిర్మిస్తూ గుట్టుగా తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
దేవాలయ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా సంబంధిత అధికారులు తక్షణం స్పందించి, పూర్తిస్థాయి విచారణ చేపట్టి అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
భూమి రిజిస్ట్రేషన్ విషయం లో తమకు న్యాయం చేయాలి..!
Modi Israel Visit: మోడీ పర్యటన తర్వాతే ఇరాన్‌పై దాడులు, ఆ మీటింగ్ లో అసలు ఏం జరిగింది?
