తెలంగాణ

2027 డిసెంబర్‌కు SLBC పూర్తిచేస్తామన్న సీఎం.. ఇది సాధ్యమేనా?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ఎస్‌ఎల్‌బీసీ (SLBC) పూర్తిచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అందుకు డెడ్‌లైన్‌ కూడా పెట్టుకున్నారు. మరి లక్ష్యాన్ని చేరుకుంటారా..? అనుకున్న సమయానికి ఎస్‌ఎల్‌బీసీని పూర్తిచేస్తారా..? అసలు ఇందులో ఉన్న సాధ్యాసాధ్యాలు ఏంటి..? సక్సెస్‌ రేట్‌ ఎంత..? ప్రతికూల పరిస్థితులను అధిగమించడం ఎలా..? 2027, డిసెంబర్‌ 9… ఇదే ఎస్‌ఎల్‌బీసీ (SLBC)ని పూర్తిచేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి పెట్టుకున్న డెడ్‌లైన్‌. ఎందుకంటే… అప్పటికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా నాలుగేళ్లు పూర్తవుతుంది. 2028లో ఎన్నికలు వస్తాయి. అందుకే… ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఆ డేట్‌ను ఎంచుకున్నట్టు ఉన్నారు. ఎన్నికలకు ఏడాది ముందే… SLBCని పూర్తిచేయాలని అనుకుంటున్నారు. అయితే… ఇది సాధ్యమేనా అన్న చర్చ జరుగుతోంది.

Read also : బర్త్ డే చేస్తామని పిలిచి, యువతిపై గ్యాంగ్ రేప్!

2023, జనవరిలో టీబీఎం మిషన్‌ పాడవడం వల్ల సొరంగం పనులు ఆగిపోయాయి. టీబీఎం మిషన్‌ను బాగుచేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం… అమెరికాలోని రాబిన్స్ సంస్థ నుంచి బేరింగ్‌ను కొనుగోలు చేసింది. మిషన్‌కు బేరింగ్‌ బిగించేందుకు అవసరమైన పరికరాలు కెనడా నుంచి తెప్పిస్తోంది. త్వరలో అవి కూడా చేరుకుంటాయి. పరికరాలు వచ్చినా.. TBM మిషన్‌కు బేరింగ్ బిగించేందుకు రెండు నెలల సమయం పడుతుంది. బేరింగ్‌ పనులు పూర్తయిన తర్వాత… ఔట్‌లెట్‌ వైపు పనులు మొదలవుతున్నాయి. ఎస్‌ఎల్‌బీసీ (SLBC)ని అనుకున్న సమయానికి పూర్తిచేయాలని.. ఒక్కరోజు ఆలస్యమైనా ఊరుకోనని… సీఎం రేవంత్‌రెడ్డి గట్టిగా హెచ్చరించారు. శ్రీశైలం నుంచి అక్కంపల్లి రిజర్వాయర్‌ వరకు ఉన్న సమస్యలపై వెంటనే రిపోర్ట్‌ ఇవ్వాలన్నారు. అంతేకాదు… ఎస్‌ఎల్‌బీసీ పనులకు గ్రీన్‌చానల్‌లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం రెడీగా ఉందని కూడా తెలిపారు. అన్ని పరికరాలను సిద్ధం చేసుకోవాలని కాంట్రాక్ట్‌ సంస్థలకు కూడా ఆదేశాలు ఇచ్చారు. SLBC పూర్తిచేసి తీరాలనే పట్టుదలతో ఉన్నారు ముఖ్యమంత్రి. 44 కిలోమీటర్ల పొడవైన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో.. ఇప్పటికే 35 కిలోమీటర్ల సొరంగం పూర్తయ్యింది. ఇక 9 కిలోమీటర్లు మాత్రమే తవ్వాలి. ఈ పని కోసం హేలిబోర్న్‌ సర్వే చేయనుంది ప్రభుత్వం. ఈ సర్వేలో భూగర్భంలో 500 మీటర్ల వరకు భూమి స్వరూపాన్ని అంచనా వేయొచ్చు. అంతేకాదు ఖనిజాలు, భూగర్భ జలాలను గుర్తించొచ్చు. దేశంలో సీఎస్‌ఐఆర్‌-ఎన్‌జీఆర్‌ఐ వంటి సంస్థలు ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. హేలిబోర్క్‌ సర్వే రిపోర్ట్‌ ఆధారంగా SLBC సొరంగం పనులు పూర్తిచేయాలని భావిస్తోంది రేవంత్‌ సర్కార్‌. అయితే.. సొరంగంలోని ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మార్చుకోగలరా..? అన్నదే ఇక్కడ ప్రశ్న.

Read also : రష్యా, ఉక్రెయిన్‌ భీకర దాడులు, ముగ్గురు మృతి!

ఎస్‌ఎల్‌బీసీ (SLBC)ని పూర్తి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన వెంటనే ప్రతిపక్షా విమర్శలు ఎక్కుపెట్టాయి. సొంగంలో పనిచేయిన 9 మంది కార్మికుల మృతదేహాలు బయటకు తీయడం చేతగాని వాళ్లు… SLBCని పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో.. ప్రభుత్వం SLBCని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే.. అనుకున్న సమయానికి పూర్తిచేస్తుందో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button