
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి రోజున ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 56 ఏళ్ల వయసులోనూ సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫిట్నెస్ తో గ్రౌండ్లో పరుగులు తీస్తూ తోటి ప్లేయర్లతో పాటు కాసేపు ఆటను ఆస్వాదించారు. టీ షర్ట్ మరియు షార్ట్ వేసుకుని అచ్చం 25 ఏళ్ల యువకుడి లాగానే ఫుట్బాల్ ఆటను ఆడారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫుల్ ఫిట్నెస్ తో ఉన్నారు అని.. ప్రతిరోజు కూడా సీఎం ఏ విధంగా డైట్ ఫాలో అవుతారని సోషల్ మీడియా వేదిక చాలా మంది ప్రశ్నలు వేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు అలాగే కుటుంబ సభ్యులు రేవంత్ రెడ్డి ఉదయాన్నే గంట సేపు జిమ్ చేస్తారు అని ఆ తరువాత బ్రేక్ ఫాస్ట్ బదులుగా కేవలం అన్నం మాత్రమే తింటారు అని తెలిపారు. అలాగే ప్రతిరోజు కూడా జొన్న రొట్టె తింటారు అని.. రేవంత్ కు ఎటువంటి మందు లేదా సిగరెట్ లాంటి అలవాట్లు లేవు అని స్పష్టం చేశారు. కాగా మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి ఫుట్బాల్ దిగ్గజా ఆటగాడు మెస్సి రాబోతున్న సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మెస్సితో సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ ఆడబోతున్నారు అని గత కొద్దిరోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలోనే రేవంత్ రెడ్డి ఇప్పటినుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది.
Read also : సీఎం ఫిర్యాదుదారులను బెదిరించి మరీ కేసులను మూయిస్తున్నారు : బొత్స సత్యనారాయణ
Read also : పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన తెలంగాణ మంత్రులు.. ఎందుకంటే?





