
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సీఎం చంద్రబాబు కేసుల విషయం పై కీలక ఆరోపణలు చేశారు. గతంలో సీఎం చంద్రబాబుపై ఉన్నటువంటి కేసులు అన్నిటిని కూడా నేడు అధికారంలో ఉండడంతో ఫిర్యాధుదారలను బెదిరించి మరి కేసులను ఉపసంహరించుకునేలా చేస్తున్నారు అని తీవ్రంగా విమర్శించారు. తనపై ఉన్నటువంటి అవినీతి కేసులను మూసి వేయించేందుకు ఒక ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అని చంద్రబాబుపై మండిపడ్డారు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు పై ఉన్నటువంటి లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నిన్న సీఎం చంద్రబాబుపై ఉన్న లిక్కర్ కేసు మూసి వేయబడింది. గత వైసిపి ప్రభుత్వం లో చంద్రబాబుపై లిక్కర్ కేసు నమోదు అవ్వగా ఈ కేసు దర్యాప్తును తాజాగా ముగిస్తూ సిఐడి ఫిటిషన్ దాఖలు చేసింది. లిక్కర్ కేసులో ఎక్కడా కూడా అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని పేర్కొన్నారు. దీని ఆధారంగా ఏసిబి కోర్టు కేసును మూసేసింది.. ఈ సందర్భంలోనే సీఎంగా అధికారంలో ఉన్నందున ఫిర్యాదుదారులను బెదిరించి మరి కేసులను ఉపసంహరించుకునేలా చేస్తున్నారని ప్రోత్స సత్యనారాయణ విమర్శించారు. గవర్నర్ ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని బొత్స సత్యనారాయణ కోరారు.
Read also : పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన తెలంగాణ మంత్రులు.. ఎందుకంటే?
Read also :Wedding drama: మలుపు తిరిగిన వివాహ కధ.. పెళ్లి మండపం నుంచి ప్రియుడితో పారిపోయిన వధువు





