Tuesday, March 17, 2026
Homeతెలంగాణ"ది సిటిజెన్ కోఆపరేటివ్" సొసైటీ చౌటుప్పల్ బ్రాంచ్ సభ్యుల సమావేశం

“ది సిటిజెన్ కోఆపరేటివ్” సొసైటీ చౌటుప్పల్ బ్రాంచ్ సభ్యుల సమావేశం

చౌటుప్పల్, క్రైమ్ మిర్రర్:
“ది సిటిజెన్ కోఆపరేటివ్” సొసైటీ చౌటుప్పల్ బ్రాంచ్ సభ్యుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సొసైటీ చైర్మన్ పి ఆర్ వి పి ఎస్ రాజు, మేనేజింగ్ డైరెక్టర్ ఎం నరేందర్ కుమార్ హాజరయ్యారు. అనంతరం చైర్మన్ రాజు మాట్లాడుతూ… గత సంవత్సరం కాలంగా సొసైటీ నందు జరిగిన మార్పులు, సొసైటీలో యాక్ట్ నందు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులను వివరించారు. మొత్తం 42 బ్రాంచీల పనితీరు, నిర్వహణ సభ్యుల సహకారాన్ని చైర్మన్ కొనియాడారు. మేనేజింగ్ డైరెక్టర్ ఎం నరేంద్ర కుమార్ మాట్లాడుతూ… గత ఆర్థిక సంవత్సరంలో సొసైటీలో 4500 కోట్ల వ్యాపారంలో దిగ్విజయంగా నిర్వహించబడిందని, అందుకు సభ్యుల సహకారం ఎంతో ఉందని, సొసైటీ యొక్క లాభనష్టాలను పూర్తిగా సభలో ఆయన వివరించారు. చౌటుప్పల్ బ్రాంచ్ యొక్క అభివృద్ధి చాలా బాగుందని అందుకు సహకరించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సభకు హాజరైనటువంటి సభ్యులు, సొసైటీలను దిగ్విజయంగా నడుపుతున్న అధికారులకు, సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో సొసైటీ మేనేజర్ జే పూర్ణయ్య, సిబ్బంది సిహెచ్ పౌల్, కె కౌశిక్, టి మహేష్, కే కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కుమ్మరి వృత్తిని ఆదుకోవాలి: ఎమ్మెల్సీ నెలికంటి సత్యం

అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments