
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని చెప్పి సర్వశక్తుల కృషి చేస్తున్నారు. దాదాపు 75 ఏళ్ల వయసులో కూడా యువకుడిలా,ఉత్సాహంగా రాష్ట్ర నలుమూలలు తిరుగుతూ ఎక్కడ ఏ అవసరం ఉందో తెలుసుకొని అవి తీరుస్తున్నారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్య సాయి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయుడు అవతారం ఎత్తారు. తనయుడు నారా లోకేష్ తో కలిసి చంద్రబాబు నాయుడు శ్రీ సత్య సాయి జిల్లాలోని కొత్తచెరువు పాఠశాల లో జరిగిన ” మెగా పేరెంట్ & టీచర్ ఆత్మీయ సమావేశ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల గురించి అన్ని కూడా ఆరా తీశారు. ఆ తరువాత విద్యార్థులకు సహజ వనరులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాఠాలు బోధించి ఉపాధ్యాయుడు అవతారం ఎత్తారు. అయితే ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ కూడా విద్యార్థుల పక్కన కూర్చుని ముఖ్యమంత్రి చెబుతున్న పాఠాలను విన్నారు. ఆ క్లాస్ రూమ్ లోని ఒక్కొక్క విద్యార్థిని భవిష్యత్తులో నువ్వు ఏం అవ్వాలని అనుకుంటున్నావు అని అడిగి తెలుసుకున్నారు. కాసేపు విద్యార్థులతో సరదాగా మాట్లాడారు. అనంతరం మంత్రి నారా లోకేష్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరితో కలిసి ఫోటోలు దిగారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా విద్యార్థుల గురించి ఆలోచించాలని.. ప్రతి ఒక్కరికి కూడా చదువు అవసరమని తల్లిదండ్రులకు సీఎం చంద్రబాబు నాయుడు సలహాలు ఇచ్చారు.
టాలీవుడ్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ‘బాహుబలి’.. సరిగ్గా ఇదే రోజు?