
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- టాలీవుడ్ యంగ్ హీరో అయినటువంటి నారా రోహిత్ పెళ్లి చాలా ఘనంగా జరిగింది. తన తోటి నటి శిరీష ను గురువారం రాత్రి 10:35 గంటలకు నారా రోహిత్ పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుకకు నారావారి ఫ్యామిలీతో పాటుగా పలువురు సినిమా నటులు, రాజకీయ ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్ వీరందరూ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా నారా రోహిత్ మరియు శిరీష ఇద్దరూ కలిసి ప్రతినిధి-2 సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ సినిమాతోనే వీరిద్దరి పరిచయం ప్రేమగా మారడంతో వీరిద్దరూ పెళ్లి బంధంతో నేడు ఒకటయ్యారు. గత ఏడాది అక్టోబర్ 13వ తేదీన వీరిద్దరి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఆ తరువాత నారా రోహిత్ తండ్రి మరణం కారణంగా వాయిదా పడిన వివాహం ఇప్పుడు చాలా ఘనంగా జరగడంతో ఇరు కుటుంబాలలో ఆనందం వెల్లు విరిసాయి. ఈ సందర్భంగా నూతన వధూవరులు వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల నారావారి అభిమానులందరూ కూడా వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం వీరందరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరుండి మరీ పెళ్లి జరిపించడంతో ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read also : జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ నేతల వినూత్న ప్రచారం..!
Read also : ప్రతి నెలా.. ప్రతి నియోజకవర్గంలో.. జాబ్ మేళాలు నిర్వహించాలి : సీఎం చంద్రబాబు
 
				 
					
 
						 
						




